మంత్రిమండలి
అమృత్‌సర్, బోధ్ గయ, నాగ్‌పుర్, సంబల్‌పుర్, సిర్‌మౌర్, విశాఖపట్నం ఇంకా జమ్ము లలో ఏడు నూతన ఐఐఎమ్ ల శాశ్వత ప్రాంగణాల స్థాపన కు మరియు కార్యకలాపాల ఆరంభానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
05 SEP 2018 9:08PM by PIB Hyderabad
అమృత్‌సర్, బోధ్ గయ, నాగ్‌పుర్, సంబల్‌పుర్, సిర్‌మౌర్, విశాఖపట్నం ఇంకా జమ్ము లలో ఏడు నూతన ఐఐఎమ్ ల శాశ్వత ప్రాంగణాల స్థాపన కు మరియు కార్యకలాపాల ఆరంభానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొత్తం 3775.42 కోట్ల రూపాయల పునరావృత్త వ్యయం అవుతుంది. (ఇందులో 2999.96 కోట్ల రూపాయల ఆవృత్తం కానటువంటి వ్యయం తో పాటు 775.46 కోట్ల రూపాయల ఆవృత్త వ్యయం భాగంగా ఉంటాయి). ఈ ఐఐఎమ్ లను 2015-16/2016-17 సంవత్సరం లో నెలకొల్పడమైంది. ఈ విద్యాసంస్థలు ప్రస్తుతం తాత్కాలిక ప్రాంగణాల లో విధులను నిర్వహిస్తున్నాయి.
అంచనా వేసినటువంటి మొత్తం 3775.42 కోట్ల రూపాయల వ్యయం లో 2804.09 కోట్ల రూపాయలను ఈ కింద పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ విద్యాసంస్థ లకు శాశ్వత ప్రాంగణాలను నిర్మించడం కోసం ఖర్చు చేయనున్నారు:
వ. సం.
|
ఐఐఎమ్ యొక్క పేరు
|
మొత్తం (కోట్ల రూపాయలలో)
|
-
|
ఐఐఎమ్ అమృత్ సర్
|
348.31
|
-
|
ఐఐఎమ్ బోధ్ గయ
|
411.72
|
-
|
ఐఐఎమ్ నాగ్‌పుర్
|
379.68
|
-
|
ఐఐఎమ్ సంబల్‌పుర్
|
401.94
|
-
|
ఐఐఎమ్ సిర్‌మౌర్
|
392.51
|
-
|
ఐఐఎమ్ విశాఖపట్నం
|
445.00
|
-
|
ఐఐఎమ్ జమ్ము
|
424.93
|
|
మొత్తం
|
2804.09
|
ఈ ఐఐఎం లలో ప్రతి ఒక్క ఐఐఎం ను 60384 చ. మీ. విస్తీర్ణం లో నిర్మించనున్నారు. ఇందులో 600 మంది విద్యార్థులకు సరిపడా పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చుతారు. 5 సంవత్సరాల కాలానికి గాను ప్రతి ఒక్క విద్యార్థికి ఏటా 5 లక్షల రూపాయల వంతున ఆవృత్తమయ్యే గ్రాంటు లను ఈ సంస్థ లకు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలపడమైంది. అటు తరువాత, ఈ సంస్థలు వాటి యొక్క నిరంతర వ్యయం/నిర్వహణ వ్యయాలను భరించడానికి అంతర్గత వనరుల నుంచి నిదులను సమకూర్చుకొంటాయని ఆశిస్తున్నారు.
ఈ విద్యాసంస్థ ల శాశ్వత ప్రాంగణాల నిర్మాణ పనులు 2021 జూన్ కల్లా పూర్తి కావలసివుంది. దీని తో మొత్తం 20 ఐఐఎమ్ లు వాటి సొంత శాశ్వత ప్రాంగణాల కు నోచుకొంటాయి.
విద్యార్థులు ప్రొఫెషనల్ మేనేజర్లు అయ్యేటట్లుగా వారికి తగిన విద్య ను ఈ ఐఐఎమ్ లు అందించనున్నాయి. దేశం లో ఆర్థిక అభివృద్ధి ని, పారిశ్రామిక అభివృద్ధి ని ప్రోత్సహించడం లో ఈ ఆమోదం తోడ్పడనుంది.
(Release ID: 1545195)
Visitor Counter : 252