మంత్రిమండలి

భార‌త‌దేశం, ద‌క్షిణ ఆఫ్రికా ల సంయుక్త త‌పాలా బిళ్ళ జారీ కి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 09 AUG 2018 5:02PM by PIB Hyderabad

‘‘భార‌త‌దేశానికి, ద‌క్షిణ ఆఫ్రికా కు మ‌ధ్య 20 సంవ‌త్స‌రాల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం’’ అనే ఇతివృత్తం పై భార‌త‌దేశం, ద‌క్షిణ ఆఫ్రికా లు సంయుక్తంగా త‌పాలా బిళ్ళ‌ ను జారీ చేయ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది.  ఈ సంయుక్త త‌పాలా బిళ్ళ‌ ల‌ను 2018 జూన్ నెల‌ లో విడుద‌ల చేశారు.  

ఈ స్మార‌క త‌పాలా బిళ్ళ ల‌లో దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి బొమ్మ తో పాటు, ద‌క్షిణ ఆఫ్రికా కు చెందిన ఆలివ‌ర్ రెజినాల్డ్ తాంబో గారి బొమ్మ‌ ఉంది.  ఈ మేర‌కు ఒక ఎంఓయూ పై భార‌త‌దేశం మ‌రియు ద‌క్షిణ ఆఫ్రికా ల మ‌ధ్య 2018 మే నెల‌లో సంత‌కాల‌య్యాయి.


**


(Release ID: 1542416) Visitor Counter : 173