మంత్రిమండలి
సంప్రదాయేతర హైడ్రోకార్బన్ ల అన్వేషణకు, సంపూర్ణ వినియోగానికి ఒక పాలిసీ ఫ్రేమ్ వర్క్ ను ఆమోదించిన మంత్రివర్గం
Posted On:
01 AUG 2018 6:10PM by PIB Hyderabad
శేల్ ఆయిల్, శేల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ (సిబిఎమ్) ల వంటి సంప్రదాయేతర హైడ్రోకార్బన్ ల అన్వేషణ కు, పూర్తి వినియోగానికి అనుమతిని ఇచ్చే విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సంప్రదాయేతర హైడ్రోకార్బన్ ల పూర్తి సామర్ధ్యాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు- లైసెన్సులు మంజూరు చేసిన/ లీజులను ఇచ్చిన ప్రాంతాలలో విధులను నిర్వర్తిస్తున్న ప్రస్తుత కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం కోసం ప్రొడక్షన్ శేరింగ్ కాంట్రాక్ట్స్ (పిఎస్‌సి లు), సిబిఎమ్ కాంట్రాక్టులు, ఇంకా నామినేషన్ ఫీల్డ్స్ విషయంలో దీనిని అమలు లోకి తీసుకు రానున్నారు.
ప్రయోజనాలు:
ప్రస్తుతం కాంట్రాక్టులు ఆచరణాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఏవైనా సంభావ్య హైడ్రోకార్బన్ నిక్షేపాలు గుర్తింపునకు, వినియోగానికి నోచుకోకుండా మిగిలిపోయివున్న పక్షంలో, వాటిని పూర్తి వినియోగం లోకి తీసుకు వచ్చేందుకు ఈ విధానం తోడ్పడనుంది.
ఈ విధానం అమలైన అనంతరం, అన్వేషణ మరియు ఉత్పత్తి (ఇ & పి) కార్యకలాపాల లోకి కొత్త పెట్టుబడులు తరలి వస్తాయని, అంతేకాక నూతన హైడ్రోకార్బన్ నిక్షేపాలను కనుగొనే అవకాశాలు, తద్వారా దేశీయ ఉత్పాదకత పెంపొందగలవని ఆశిస్తున్నారు.
అదనపు హైడ్రోకార్బన్ వనరుల యొక్క అన్వేషణ, వినియోగం అనేది నూతన పెట్టుబడులతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజాన్ని అందించడంతో పాటు ఇతరత్రా ఉద్యోగ కల్పనకు కూడా దోహదం చేసి, ఆ రకంగా సమాజం లో వివిధ వర్గాలకు ప్రయోజనాన్ని చేకూర్చగలదు.
ఇది నవీనమైన, సృజనాత్మకమైన మరియు అత్యధునాతనమైన సాంకేతిక విజ్ఞానం తెర మీదకు వచ్చేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది. అలాగే, సంప్రదాయేతర హైడ్రోకార్బన్ లను అన్వేషించడం లో నూతన సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకారానికి సైతం బాట ను పరచనుంది.
**
(Release ID: 1541144)
Visitor Counter : 285