మంత్రిమండలి

జ‌మ్ము & క‌శ్మీర్ లోని ఉధంపుర్ జిల్లా లో కేంద్రీయ విద్యాల‌య నంబర్ 2 ధార్ రోడ్డు యొక్క నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ కు 7.118 ఎక‌రాల ర‌క్ష‌ణ రంగ భూమిని బ‌దిలీ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 04 JUL 2018 2:40PM by PIB Hyderabad

జ‌మ్ము & క‌శ్మీర్ లోని ఉధంపుర్ జిల్లా లో కేంద్రీయ విద్యాల‌య నంబర్ 2 ధార్ రోడ్డు యొక్క నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ (కెవిఎస్)కు ప్ర‌తి సంవ‌త్స‌రానికి 1 రూపాయి వంతున నామ‌మాత్ర‌పు అద్దె తో 30 సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగే లీజు ప్రాతిపదికన 7.118 ఎక‌రాల డిఫెన్స్ లాండ్ ను బ‌దిలీ చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఈ లీజు ను 30 సంవత్సరాల అనంతరం ఇంతే వ్య‌వ‌ధితో మ‌రో రెండు సార్లు పున‌రుద్ధ‌రించుకొనేందుకు అవకాశం ఉంటుంది. 

పూర్వ‌రంగం:

ధార్ రోడ్డు- ఉధంపుర్ లో గల కేంద్రీయ విద్యాల‌య నంబ‌ర్‌-2, 1985 నుండి ఒక తాత్కాలిక భవనంలో నడుస్తోంది.  ప్రస్తుతం ఈ పాఠ‌శాల‌లో మొత్తం 851 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.  కెవిఎస్ సొంత శాశ్వ‌త పాఠ‌శాల భ‌వ‌నం నిర్మాణం చేప‌డితే విధి నిర్వ‌హ‌ణ లో ఉన్న సిబ్బంది యొక్క పిల్ల‌ల‌కు చెందిన విద్యావ‌స‌రాల‌ను తీర్చ‌డానికి త‌గిన మౌలిక స‌దుపాయాల‌ను నిర్మించే అవ‌కాశం పాఠ‌శాల అధికారుల‌కు చిక్కుతుంది.


****



(Release ID: 1537850) Visitor Counter : 112