మంత్రిమండలి

నేశనల్ కమిశన్ ఫర్ సఫాయీ కర్మచారీస్ లో ఒక వైస్-చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి తో పాటు ఒక స‌భ్యుడి ప‌ద‌వి ని కూడా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 04 JUL 2018 2:26PM by PIB Hyderabad

నేశనల్ కమిశన్ ఫర్ సఫాయీ కర్మచారీస్ లో ఒక వైస్-చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి ని మ‌రియు ఒక స‌భ్యుడి ప‌ద‌వి  ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణ‌యం క‌మిశన్ కార్య కౌశలాన్ని మరింత మెరుగుప‌ర‌చేందుకు మ‌రియు ల‌క్షిత సమూహం యొక్క శ్రేయం, ఇంకా అభివృద్ధి ల తాలూకు ఆశించిన ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేందుకు దోహ‌దప‌డుతుంది.

పూర్వ‌రంగం:

నేశనల్ కమిశన్ ఫర్ సఫాయీ కర్మచారీస్ అటు స‌ఫాయీ క‌ర్మ‌చారి ల శ్రేయంతో పాటు ఇటు పారిశుధ్య ప‌నివారి యొక్క శ్రేయ‌స్సుకై కృషి చేస్తోంది.  స‌ఫాయీ క‌ర్మ‌చారి ల యొక్క అవ‌కాశాలు మ‌రియు స్థితిగతుల సంబంధిత సౌక‌ర్యాల‌లోని అస‌మాన‌త‌ల‌ను పారదోలే దిశ‌గా పాటుప‌డ‌డం దీని క‌ర్త‌వ్యంగా ఉంది.   చేతులతో పరిశుభ్రత పరిరక్షక శ్రమ చేసే వారందరికీ సమయబద్ధ ప్రాతిప‌దిక‌న పున‌రావాసానికి పూచీ పడడం లో ఈ క‌మిశన్ ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తోంది.  ప్రొహిబిశన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజ్ మాన్యువ‌ల్ స్కావెంజ‌ర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేశన్ యాక్ట్, 2013 లోని 31వ సెక్ష‌న్ లో భాగంగా ఈ క‌మిష‌న్..

*  చ‌ట్టం అమ‌లును ప‌ర్య‌వేక్షించ‌డం;

*  చ‌ట్టం లోని నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నకు సంబంధించిన ఫిర్యాదుల‌ పై విచార‌ణ జ‌ర‌ప‌డం ; ఇంకా

*  చ‌ట్టం యొక్క ప‌టిష్ట అమ‌లు కై కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం 

అనేట‌టువంటి విధుల‌ను నిర్వ‌ర్తించ‌వ‌ల‌సి ఉంది.

 

***



(Release ID: 1537838) Visitor Counter : 171