మంత్రిమండలి
భారతదేశానికి మరియు సురినామ్ కు మధ్య ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన రంగంలో సహకారానికి సంబంధించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2018 3:45PM by PIB Hyderabad
భారతదేశానికి మరియు సురినామ్ కు మధ్య ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన రంగంలో సహకారానికి ఉద్దేశించినటు వంటి ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు లో భాగంగా ఎన్నికల ప్రక్రియ తాలూకు సంస్థాగత మరియు సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం, సంస్థాగత పటిష్టీకరణ, సిబ్బంది కి శిక్షణ, క్రమం తప్పక సంప్రదింపులు జరుపుకోవడం వంటి వాటికి వీలు కల్పిస్తారు.
ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన రంగంలో సురినామ్ కు సాంకేతిక సహాయాన్ని అందించడానికి మరియు ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఎంఒయు తోడ్పడగలదు.
***
(రిలీజ్ ఐడి: 1532450)
సందర్శకుల సూచీ సంఖ్య : : 119