మంత్రిమండలి
ఆరోగ్య సంరక్షణ సంబంధిత అవస్థాపనకు ప్రోత్సాహం
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ ఎస్ ఎస్ వై) ని
2019-20 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
02 MAY 2018 3:31PM by PIB Hyderabad
దేశంలో ఆరోగ్య రక్షణ సదుపాయాల విస్తరణను మరింత ప్రోత్సహించే దిశగా, ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ఎస్ఎస్ వై) ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలానంతరం 2019-20 వరకు కొనసాగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి రూ.14,832 కోట్లు వ్యయం కావచ్చని అంచనా. ఈ పథకంలో భాగంగా నూతన ఎఐఐఎమ్ఎస్ లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతే కాక ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయి ని పెంచడం కూడా జరుగుతున్నది.
లక్ష్యాలు:
పిఎమ్ఎస్ఎస్ వై కేంద్ర క్షేత్ర పథకం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తక్కువ ధరలకు మూడో దశ ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతలో అసమతౌల్యాన్ని సరిదిద్దడమే ఈ పథకం లక్ష్యం. ప్రత్యేకించి నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించేందుకు సదుపాయాలు తక్కువగా గల రాష్ట్రాలలో తగిన సౌకర్యాల పెంపును కూడా ఈ పథకం యొక్క లక్ష్యంగా నిర్దేశించారు.
ప్రభావం:
దేశంలో కొత్త ఎఐఐఎమ్ఎస్ ల ఏర్పాటువల్ల ఆరోగ్య సంరక్షణ విద్య, శిక్షణలో వినూత్న పరివర్తన చోటుచేసుకోవడమేగాక ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ నిపుణుల కొరత సమస్య కూడా తీరుతుంది. కొత్త ఎఐఐఎమ్ఎస్ ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. అంతేగాక వాటి కార్యకలాపాల వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఇక ఆరోగ్య రక్షణ సదుపాయాలు మెరుగుపరచడం కోసం సూపర్ స్పెషాలిటీ బ్లాకులు/ట్రామ సెంటర్ ల నిర్మాణం వంటివి చేపట్టాలని వైద్య కళాశాల స్థాయి పెంపు కార్యక్రమం నిర్దేశిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత, కొత్త ఆసుపత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రాతిపదికన వైద్య పరికరాలను కొనుగోలు చేయవలసివుంటుంది.
ఉపాధి అవకాశాల సృష్టి:
కొత్తగా ఎఐఐఎమ్ఎస్ లను వివిధ రాష్ట్రాలలో నిర్మించనున్నందున ఒక్కొక్క దానిలో సుమారు 3 వేల మంది వంతున బోధన, బోధనేతర ఉద్యోగాల రూపేణా అదనపు ఉద్యోగాల సృష్టి వీలుపడుతుంది. అంతేగాకుండా నూతన ఎఐఐఎమ్ఎస్ పరిసరాలలో షాపింగ్ సెంటర్ లు, కేంటీన్ ల వంటి సదుపాయాలు-సేవల రూపంలో పరోక్ష ఉపాధి సృష్టికీ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక స్థాయి పెంపు కార్యక్రమం లో భాగంగా కేంద్రం నియమించిన సంస్థలు ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఎంపిక చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తాయి. ఆయా ప్రభుత్వ కళాశాలల్లో నిబంధనల మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కేటాయింపుతోపాటు అదనపు బోధన సిబ్బంది పోస్టుల కల్పన, భర్తీ బాధ్యతలను సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేపడతాయి. కొత్త ఎఐఐఎమ్ఎస్, వైద్య కళాశాలల స్థాయి పెంపు పథకాలలో భాగంగా భౌతికంగా మౌలిక వసతుల నిర్మాణ కార్యకలాపాల ద్వారా కూడా నిర్మాణ దశలో ఉపాధి సృష్టి గణనీయ స్థాయిలో ఉంటుంది.
పూర్వ రంగం:
పిఎమ్ఎస్ఎస్ వై ని 2003 లో ప్రకటించడమైంది. సముచిత/విశ్వసనీయ మూడో దశ ఆరోగ్య సంరక్షణ సేవల అందుబాటులో ప్రాంతీయ అసమతౌల్యాన్ని సరిదిద్దడం సహా దేశంలో నాణ్యమైన వైద్య విద్య అభ్యాసం దిశగా మౌలిక వసతుల అభివృద్ధి ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. పిఎమ్ఎస్ఎస్ వై రెండు విధాలుగా అమలవుతుంది :-
- అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఐఐఎమ్ఎస్)ల వంటివి ఏర్పాటు చేయడం;
- రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య కళాశాల(జిఎమ్ సి)ల స్థాయి పెంపు.
పిఎమ్ఎస్ఎస్ వై లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులు:
పిఎమ్ఎస్ఎస్ వై లో భాగంగా పలు దశలలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనులు ఈ కింది విధంగా ఉన్నాయి:
చేపట్టిన దశ.. బడ్జెటు లో ప్రకటించిన సంవత్సరం
|
ఎహెచ్ఎమ్ ఎస్ వంటి సంస్థలు
|
రాష్ట్రాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య కళాశాల(జిఎమ్ సి)ల స్థాయి పెంపు
|
1వ దశ (2006)
|
భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పుర్, పట్నా, రాయ్ పుర్, రుషికేశ్ (06 ఎఐఐఎమ్ఎస్)
|
పదమూడు (13) ప్రభుత్వ వైద్య కళాశాలలు
|
2వ దశ (2009)
|
పశ్చిమ బెంగాల్ లో ఎఐఎమ్ఎస్ (నాలుగో దశకు మార్పు), రాయ్‌బరేలీ (ఉత్తర్ ప్రదేశ్)లో (01 ఎఐఎమ్ఎస్)
|
ఆరు (6) ప్రభుత్వ వైద్య కళాశాలలు
|
3వ దశ (2013)
|
కొత్త ఎఐఐఎమ్ఎస్ లు లేవు
|
ముప్ఫై తొమ్మిది (39) ప్రభుత్వ వైద్య కళాశాలలు
|
4వ దశ (2014-15)
|
పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, పూర్వాంచల్-ఉత్తర్ ప్రదేశ్ (04 ఎఐఐఎమ్ఎస్)
|
పదమూడు (13) ప్రభుత్వ వైద్య కళాశాలలు
|
5వ దశ (2015-16)
|
జమ్ము, కశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, అసోం, బిహార్ (07 ఎఐఐఎమ్ఎస్)
|
-
|
5వ దశ (ఎ) (2016-17)
|
-
|
ఐఎమ్ఎస్, బిహెచ్ యు తో పాటు శ్రీచిత్ర తిరునాళ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ-కేరళల్లో రెండు (02) సూపర్ స్పెషాలిటీ బ్లాకుల స్థాయి పెంపునకు మంత్రిత్వ శాఖ ఆమోదం
|
6వ దశ (2017-18)
|
గుజరాత్ మరియు ఝార్ ఖండ్ (02 ఎఐఐఎమ్ఎస్)
|
-
|
మొత్తం
|
20 ఎఐఐఎమ్ఎస్
|
73 స్థాయి పెంపు ప్రోజెక్టులు
|
***
(Release ID: 1531168)
Visitor Counter : 119