మంత్రిమండలి
మానవ వినియోగానికి ఉద్దేశించిన వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారానికి సంబంధించి బ్రిక్స్ దేశాలకు చెందిన వైద్య నియంత్రణ సంస్థల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
25 APR 2018 1:14PM by PIB Hyderabad
మానవ వినియోగానికి ఉద్దేశించిన వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారానికి సంబంధించి బ్రిక్స్ (BRICS) దేశాలకు చెందిన వైద్య నియంత్రణ సంస్థ ల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ ఒయు సంబంధిత పక్షాల నడుమ నియంత్రణ పరమైన అంశాలపై మెరుగైన అవగాహన ఏర్పడడానికి మార్గాన్ని సుగమం చేయనుంది. అలాగే, భారతదేశం నుండి బ్రిక్స్ దేశాలకు వైద్య ఉత్పత్తులు పెరిగేందుకు కూడా ఈ ఎమ్ఒయు దోహదం చేయగలదు.
***
(Release ID: 1530286)
Visitor Counter : 79