• Sitemap
  • Advance Search
Social Welfare

యువతకు సాధికారత, మారుతున్న‌ భారత్‌

प्रविष्टि तिथि: 13 AUG 2026 13:11 PM

వికసిత్‌ భారత్‌@2047 కోసం అమృత్‌ పీఢి
ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. ఈ జనాభా ప్రయోజనాన్ని అభివృద్ధి ఫలంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఔత్సాహికత, క్రీడలు, ఆరోగ్యం, పౌర భాగస్వామ్యం వంటి రంగాల్లో పెట్టుబడులను విస్తరిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ వికసిత్‌ భారత్‌@2047 నిర్మాణంలో అమృత్‌ పీఢి కీలక పాత్ర పోషించేలా తోడ్పడుతున్నాయి.

మై భారత్‌: యువత ఆధ్వర్యంలో అభివృద్ధికి వేదిక
ఈ దార్శనికతకు కేంద్రంగా ‘మేరా యువ భారత్‌’ నిలుస్తోంది. 15–29 ఏళ్ల యువత కోసం 2023 అక్టోబరులో దీన్ని ప్రారంభించారు. సాంకేతిక ఆధారిత ఈ వేదిక స్వచ్ఛంద సేవ, అనుభవపూర్వక అభ్యాసం, నాయకత్వం, నైపుణ్య శిక్షణ, కెరీర్‌ సహాయం, పౌర భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ కిందకు తీసుకొస్తోంది.
* విస్తరిస్తున్న జాతీయ వేదిక – 2026 జూలై నాటికి స్వచ్ఛంద సేవ, అనుభవపూర్వక అభ్యాసం, నాయకత్వం, నైపుణ్య శిక్షణ, కెరీర్‌ అవకాశాల కోసం 2.22 కోట్లకు పైగా యువత ఈ వేదికలో నమోదు చేసుకున్నారు.
* భారీ స్థాయిలో స్వచ్ఛంద సేవ – 1.52 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవా అవకాశాలు యువతకు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి.
* అనుభవం ద్వారా అభ్యాసం – 24,900కు పైగా అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలు యువతను పాలన, ఆరోగ్య సంరక్షణ, ప్రసార మాధ్యమాలు, సాంకేతికత, ప్రజాసేవతో అనుసంధానించాయి.

డిజిటల్‌ అనుసంధానం, పౌర భాగస్వామ్యం
* వికసిత్‌ భారత్‌ యువ నాయకుల సంవాద్ 2026 – 
దేశవ్యాప్తంగా నిర్వహించిన క్విజ్‌లో 50 లక్షలకు పైగా యువత పాల్గొన్నారు. 21 దేశాలకు చెందిన 78 మంది ప్రవాస భారతీయ యువత కూడా ఈ సంవాద్‌లో పాల్గొన్నారు. జిల్లాలవారీ సమాచార నిధి కోసం 6 వేల మంది యువ నాయకులను గుర్తించారు.
* జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) – స్వచ్ఛంద సేవకుల నమోదు 2014–15లో 34.09 లక్షల నుంచి 2025–26లో 38.90 లక్షలకు పెరిగింది.

విద్య: అందుబాటు, నాణ్యత, భవిష్యత్తుకు సంసిద్ధత
విద్యావ్యవస్థ విస్తరించడంతో పాటు మరింత సౌలభ్యంగా, డిజిటల్‌ ఆధారితంగా, ఆవిష్కరణలకు అనుకూలంగా మారింది. జాతీయ విద్యా విధానం–2020 విద్యార్థిని కేంద్రంగా ఉంచుతూ పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యాన్ని అనుసంధానిస్తోంది.
* ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల వ్యవస్థల్లో ఒకటి – భారత్‌లో 14.67 లక్షల పాఠశాలలు 24.72 కోట్ల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. 1.02 కోట్లకు పైగా ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు.
* చదువు కొనసాగింపులో మెరుగుదల – మాధ్యమిక పాఠశాల స్థాయిలో చదువు మానివేత రేటు 2013–14లో 14.54 శాతం నుంచి 2025–26లో 7 శాతానికి తగ్గింది.
* డిజిటల్‌ తరగతి గదులు – 2025–26 నాటికి 1.49 లక్షలకు పైగా పాఠశాలలను ఐసీటీ, డిజిటల్‌ కార్యక్రమాల పరిధిలోకి తీసుకొచ్చారు. 2026 మార్చి నాటికి 1.76 లక్షలకు పైగా స్మార్ట్‌ తరగతి గదులు, 1.79 లక్షల ఐసీటీ ప్రయోగశాలలకు మంజూరు ఇచ్చారు.
* అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ – 10 వేలకుపైగా ప్రయోగశాలలు 1.1 కోట్లకుపైగా విద్యార్థి ఆవిష్కర్తలను భాగస్వాములను చేశాయి. 16 లక్షలకు పైగా ప్రాజెక్టులకు సహాయం అందించాయి.

ఉన్నత విద్య, ఆవిష్కరణలు
* పెరుగుతున్న నమోదు –
 ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 2014–15లో 3.4 కోట్ల నుంచి 2023–24లో 4.5 కోట్లకు పెరిగింది. మహిళల నమోదు 2014–15 నుంచి 42.2 శాతం వృద్ధి చెంది, 2023–24లో 2.2 కోట్లకు చేరింది.
* సంస్థాగత వృద్ధి

 


* ఇంక్యుబేషన్‌, పరిశోధన – 85 అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాలు 32 వేలకుపైగా ఉద్యోగాలను సృష్టించాయి. 2,900కు పైగా అంకుర సంస్థలకు సహాయం అందించాయి.

అభ్యాస సౌల‌భ్యం, డిజిటల్ సౌక‌ర్యం
* జాతీయ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ –
 700కు పైగా విశ్వవిద్యాలయాలు, 7,500కు పైగా అనుబంధ కళాశాలలు జాతీయ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఆర్‌ఎఫ్‌)ను స్వీకరించాయి.
* అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ – 3,123 విద్యాసంస్థలు ఈ వ్యవస్థలో చేరాయి. 2026 ఆగస్టు 12 నాటికి 35.27 కోట్లకు పైగా అపార్‌ గుర్తింపు సంఖ్యలను జారీ చేశారు. దీంతో విద్యార్థులు తమ క్రెడిట్లను భద్రపరుచుకోవడం, బదిలీ చేయడం, వినియోగించుకోవడం సాధ్యమవుతోంది.
* స్వయం – 2026 ఆగస్టు 12 నాటికి ఈ వేదిక 20,370కు పైగా కోర్సులను అందిస్తోంది. 6.5 కోట్లకు పైగా నమోదులు జరిగాయి.
* దీక్ష – దేశవ్యాప్తంగా 342 కోర్సుల్లో 19.06 కోట్ల నమోదులు జరిగాయి. 15.02 కోట్ల మంది కోర్సులను పూర్తి చేయగా, 2026 ఆగస్టు 12 నాటికి 13 కోట్ల ధ్రువపత్రాలను జారీ చేశారు.

నైపుణ్య శిక్షణ, ఉపాధి సామర్థ్యం
ప్రభుత్వం తన నైపుణ్య కార్యక్రమాల ద్వారా 6 కోట్లకు పైగా ప్రజలకు సాధికారత కల్పించింది. స్కిల్‌ ఇండియా మిషన్‌ శిక్షణను ప్రాథమిక ధ్రువీకరణకు పరిమితం చేయకుండా పరిశ్రమలు, అప్రెంటిస్‌షిప్‌, డిజిటల్‌ వేదికలు, కొత్త సాంకేతికతలతో అనుసంధానించిన డిమాండ్‌ ఆధారిత నమూనా దిశగా మళ్లించింది.


* తగ్గిన నిరుద్యోగం – నిరుద్యోగ రేటు 2014లో 7.71 శాతం నుంచి 2025లో 4.2 శాతానికి తగ్గింది.
* ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) – 2015 నుంచి నాలుగు దశల్లో 1.64 కోట్లకు పైగా యువతకు శిక్షణ ఇచ్చారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్‌, హరిత ఇంధనం, ఇతర భవిష్యత్‌ రంగాల్లో పరిశ్రమలతో అనుసంధానించిన శిక్షణతో పాటు పని ప్రదేశాల్లో అనుభవాన్ని పీఎంకేవీవై అందిస్తోంది.
* జన్‌ శిక్షణ్‌ సంస్థాన్‌ – 2026 మార్చి వరకు 36.48 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.
* జాతీయ అప్రెంటిస్‌షిప్‌ ప్రోత్సాహక పథకం (ఎన్‌ఏపీఎస్‌) – 2026 మార్చి వరకు 54.41 లక్షలకు పైగా అప్రెంటిస్‌లకు అవకాశాలు కల్పించారు.
* స్టార్టప్‌ ఇండియా – 2014కు ముందు దాదాపు 350గా ఉన్న అంకుర సంస్థల సంఖ్య 2026 ఆగస్టు నాటికి 2.47 లక్షలకు పైగా పెరిగింది. దీంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్‌ నిలిచింది.
* ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం – 2026 ఆగస్టు 12 నాటికి పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం 31 రంగాల్లో 1,64,902 ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పించింది.
* పీఎం–సేతు – పరిశ్రమల భాగస్వామ్యం, కార్మిక విపణి అవసరాలకు అనుగుణమైన కోర్సులతో 200 ప్రధాన కేంద్రాలు, 800 అనుబంధ కేంద్రాల ద్వారా వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించేందుకు 2025 అక్టోబరులో ఈ పథకాన్ని ప్రారంభించారు. అంచనా వ్యయం ₹60 వేల కోట్లు.
* 2014 నుంచి 2025 మధ్య ఐటీఐల సంఖ్య 9,977 నుంచి 14,688కు, విద్యార్థుల నమోదు 9.5 లక్షల నుంచి 14.7 లక్షలకు, జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల సంఖ్య 25 నుంచి 33కు పెరిగింది. శిక్షకుల శిక్షణ సంస్థల సంఖ్య 11 నుంచి 120కు పెరిగింది.

 



క్రీడలు, దేహదారుఢ్యం
స్థానిక ప్రతిభను గుర్తించడం నుంచి అత్యున్నత స్థాయి పనితీరుకు సహాయం అందించడం వరకు భారత్‌ ఒక వ్యవస్థీకృత క్రీడా మార్గాన్ని నిర్మించింది. శిక్షణ, మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ శిక్షణ పద్ధతులు, పోటీల్లో పాల్గొనే అవకాశాల మద్దతుతో క్రీడలను ఆచరణీయమైన కెరీర్‌గా ఎక్కువ మంది పరిగణిస్తున్నారు.
* ఖేలో ఇండియా మౌలిక సదుపాయాలు – ఈ పథకం కింద ₹3,176 కోట్ల విలువైన 349 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. 1,067 ఖేలో ఇండియా కేంద్రాలు, 267 అకాడమీలను ఏర్పాటు చేశారు. ఈ పథకం 2,745 మంది క్రీడాకారులకు కూడా సహాయం అందిస్తోంది.
* ఖేలో ఇండియా క్రీడలు – 2018 నుంచి యువజన, విశ్వవిద్యాలయ, శీతాకాల, పారా, బీచ్‌, జల క్రీడలు, గిరిజన క్రీడల్లో 63 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
* అగ్రశ్రేణి క్రీడాకారులకు సహాయం – టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) 51 మంది కోర్‌, 52 మంది పారా కోర్‌, 130 మంది డెవలప్‌మెంట్‌ క్రీడాకారులకు సహాయం అందిస్తోంది. కోర్‌, డెవలప్‌మెంట్‌ క్రీడాకారులకు వరుసగా నెలకు ₹50 వేలు, ₹25 వేల ఉపకార వేతనం అందుతోంది.
* పెరిగిన పెట్టుబడులు – పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం, జాతీయ క్రీడా సమాఖ్యలకు మెరుగైన సహాయం కోసం 2026–27 నుంచి 2030–31 కాలానికి కలిపి ₹36,441 కోట్లు కేటాయించారు.

 

 


ఆరోగ్యం, శ్రేయస్సు
యువత సాధికారత శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, వ్యాధుల నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. కౌమారదశ వారికి అనుకూలమైన సేవలు, మానసిక ఆరోగ్య సలహాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటును ప్రభుత్వ కార్యక్రమాలు విస్తరించాయి.
* కౌమార ఆరోగ్యం – కౌమారదశ వారికి అనుకూలమైన ఆరోగ్య కేంద్రాల సంఖ్య 2014–15లో 6,619 నుంచి 2021–22లో 7,203కు పెరిగింది. ఇదే కాలంలో వైద్య సేవలు, సలహాలు పొందిన కౌమారదశ వారి సంఖ్య 39 లక్షల నుంచి 82 లక్షలకు పెరిగింది. 2024 నవంబరు వరకు 2024–25లో 97.67 లక్షల మంది యువత ఈ కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు.
* మానసిక ఆరోగ్యం – 2026 ఆగస్టు 12 నాటికి టెలి–మానస్‌లోని 53 కేంద్రాలు 43.70 లక్షలకు పైగా ఫోన్‌ కాల్స్‌ను పరిష్కరించాయి. 23 మార్గదర్శక సంస్థలు, ఐదు ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు ఈ సేవలకు సహకరిస్తున్నాయి.
* మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ – 2026 ఆగస్టు 12 నాటికి నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 11.86 కోట్ల మంది యువత సహా 30.05 కోట్లకు పైగా ప్రజలకు చేరువైంది. విద్యాసంస్థల్లో 28.56 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. 28.29 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స, పునరావాస సహాయం అందించారు.

పరివర్తనకు పన్నెండేళ్లు
వివిధ రంగాల్లో పన్నెండేళ్లుగా కొనసాగుతున్న పెట్టుబడులు భారత యువతలో కొలవదగిన పరివర్తనను తీసుకొచ్చాయి. ఎక్కువ మంది యువ భారతీయులు విద్యను కొనసాగిస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పొందుతున్నారు. వ్యవస్థీకృత ఉపాధిలోకి ప్రవేశిస్తున్నారు. వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అత్యున్నత స్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నారు.

అందుబాటు నుంచి అవకాశాల దిశగా, భాగస్వామ్యం నుంచి నాయకత్వం దిశగా, లబ్ధిదారులుగా ఉన్న యువతను సహ-సృష్టికర్తలుగా తీర్చిదిద్దే దిశగా మార్పు వచ్చింది. విధానాలు, సంస్థలు, డిజిటల్‌ వేదికలు బలమైన పునాదులు వేశాయి. వికసిత్‌ భారత్‌@2047 లక్ష్య సాధన దిశగా అమృత్‌ పీఢి ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

 

References

Ministry of Education

https://udiseplus.gov.in/#/en/home

https://dashboard.udiseplus.gov.in/report2026/static/media/UDISE+2025_26_Booklet_nep.94ceae1e8c2210549d21.pdf (pg 29)

https://www.dohe-education.gov.in/static/uploads/2026/07/426440f1daac445265cdea027ae6a00d.pdf (pg 1)

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297090&reg=48&lang=2

https://www.abc.gov.in/

https://swayam.gov.in/

https://diksha.gov.in/data/

 

Ministry of Social Justice and Empowerment

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241240&reg=48&lang=2

https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan/

 

Ministry of Personnel, Public Grievances, and Pensions

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1929384&reg=3&lang=2

 

Ministry of Commerce and Industry

https://www.startupindia.gov.in/

Ministry of Corporate Affairs

https://pminternship.mca.gov.in/login/

Ministry of Health and Family Welfare

https://sansad.in/getFile/annex/258/AS147.pdf?source=pqars

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2024/dec/doc20241228477601.pdf

https://telemanas.mohfw.gov.in/telemanas-dashboard/#/

PIB Backgrounders

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=159409&ModuleId=3&reg=48&lang=1

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?id=150695&NoteId=150695&ModuleId=16&reg=48&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158887&ModuleId=3&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256476&reg=3&lang=2

NITI Aayog

https://aim.gov.in/aic.php

Click here to see PDF

PIB Research

 

***

(तथ्य सामग्री आईडी: 150940) आगंतुक पटल : 61


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Kannada , Bengali , Malayalam , Assamese , Urdu