• Sitemap
  • Advance Search
Farmer's Welfare

భారత వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నవశకం

प्रविष्टि तिथि: 12 AUG 2026 17:53 PM

“వృద్ధి, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, ఆహార భద్రతకు ఊతం”
 


వ్యవసాయ పరివర్తనకు ప్రోత్సాహం
పెరుగుతున్న ఉత్పాదకత, రైతులకు పటిష్ఠ మద్దతు వ్యవస్థలు, విపత్తులను తట్టుకునే మెరుగైన సామర్థ్యంతో భారత వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు గణనీయ పరివర్తనను సాధిస్తున్నాయి. దేశ శ్రామికశక్తిలో దాదాపు 46.1 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తూ వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కొనసాగుతోంది. పశుసంవర్ధక, మత్స్య రంగాలు స్థిరంగా 5–6 శాతం వృద్ధిని నమోదు చేస్తూ గ్రామీణ ఆదాయాలను పెంచుతున్నాయి. వ్యవసాయ వైవిధ్యీకరణకు మద్దతు ఇస్తున్నాయి. గత దశాబ్దంలో నిరంతర విధానపరమైన చర్యలతో రుణాలు, బీమా, మార్కెట్లకు రైతుల ప్రాప్యత మెరుగుపడింది. డిజిటల్‌ సాంకేతికతల వినియోగం వేగం పుంజుకుంది. ఆహార శుద్ధి, సహకార సంఘాలు, పశుసంవర్ధకం, పాడి, మత్స్య రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు వ్యవసాయ విలువ గొలుసు అంతటా విలువ జోడింపు, ఆదాయ వైవిధ్యీకరణ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నాయి.

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం

 


* వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు(జీవీఏ) 2014–15లో ₹20.94 లక్షల కోట్ల నుంచి 2025–26లో అంచనా ప్రకారం ₹52.08 లక్షల కోట్లకు పెరిగింది.
* వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగానికి బడ్జెట్‌ కేటాయింపులు 2013–14లో ₹27,663 కోట్ల నుంచి 2026–27లో ₹1,40,528.78 కోట్లకు పెరిగాయి.

పెరిగిన వ్యవసాయోత్పత్తి
* మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 2013–14లో 265.05 మిలియన్‌ టన్నుల నుంచి 2025–26లో 376.56 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఇది మూడో ముందస్తు అంచనా.
* ఉద్యాన పంటల ఉత్పత్తి 2013–14లో 280.70 మిలియన్‌ టన్నుల నుంచి 2025–26లో దాదాపు 377.78 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఇది రెండో ముందస్తు అంచనా.
* నూనెగింజల ఉత్పత్తి 2014–15లో 27.51 మిలియన్‌ టన్నుల నుంచి 2025–26లో 43.06 మిలియన్‌ టన్నులకు పెరిగింది(ఇది మూడో ముందస్తు అంచనా).

 


రైతుల జీవనోపాధికి భరోసా
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌)

* పథకం కింద 23 విడతల్లో ₹4.47 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు.
* 23వ విడత కింద 9.49 కోట్లకు పైగా రైతులకు ₹18,984 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)
* 2016–17లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి 92.46 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు బీమా రక్షణ కల్పించారు.
* 2025 డిసెంబర్‌ వరకు దాదాపు 24.31 కోట్ల మంది రైతులకు ₹1.96 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను చెల్లించారు.

కనీస మద్దతు ధరలు(ఎంఎస్‌పీ)
* మొత్తం సేకరణ 2004–2014 మధ్య 698.7 మిలియన్‌ టన్నులుగా ఉండగా, 2014–2026 మధ్య 1,229.2 మిలియన్‌ టన్నులకు పెరిగింది.
* మొత్తం కనీస మద్దతు ధర విలువ 2004–2014 మధ్య ₹7.41 లక్షల కోట్లుగా ఉండగా, 2026 ఫిబ్రవరి వరకు 2014–2026 మధ్య ₹26.32 లక్షల కోట్లకు పెరిగింది.
* గ్రేడ్‌–ఏ వరి కనీస మద్దతు ధర 2014–15లో క్వింటాలుకు ₹1,400 నుంచి 2026–27లో ₹2,461కు పెరిగింది.
* గోధుమ కనీస మద్దతు ధర 2014–15లో క్వింటాలుకు ₹1,400 నుంచి 2026–27లో ₹2,585కు పెరిగింది.



కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం
2026 ఆగస్టు 3 నాటికి:
* 2025–26లో దేశవ్యాప్తంగా 7.28 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి.
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం కింద చెల్లించాల్సిన రుణ బకాయిల మొత్తం ₹10.08 లక్షల కోట్లుగా ఉంది.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన(పీఎంకేఎంవై)
* 2026 ఫిబ్రవరి నాటికి దాదాపు 24.96 లక్షల మంది రైతులు పథకంలో నమోదయ్యారు.

సుస్థిర వ్యవసాయం దిశగా
భూసార ఆరోగ్య కార్డు పథకం

* 2026 జూలై నాటికి 26.09 కోట్ల భూసార ఆరోగ్య కార్డులను జారీ చేశారు.
* భూసార ఆరోగ్యంపై సలహాలు అందించడం, సమాచారంతో కూడిన సాగు పద్ధతులకు రైతులను ప్రోత్సహించడం కోసం 70,002కు పైగా కృషి సఖిలకు శిక్షణ ఇచ్చారు.

పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన(పీకేవీవై)
* పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూన్‌ వరకు 18.93 లక్షల హెక్టార్లను పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో 33.63 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.

ఈశాన్య ప్రాంత సేంద్రియ విలువ గొలుసు అభివృద్ధి మిషన్‌(ఎంఓవీసీడీఎన్ఈఆర్‌)
* పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూన్‌ 30 వరకు 2.36 లక్షల హెక్టార్లను సేంద్రియ వ్యవసాయం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో 2.74 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌(ఎన్ఎంఎన్ఎఫ్‌)
* 2025–26 ఆర్థిక సంవత్సరంలో 10.32 లక్షల హెక్టార్ల పరిధిలో 18,893 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు.
* 33.89 లక్షల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
* ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ వ్యవస్థలో 22.47 లక్షలకు పైగా రైతులను నమోదు చేశారు. వీరిలో 14.43 లక్షలకు పైగా రైతులు ధ్రువీకరణ పొందారు.

ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఏవమ్‌ ఉత్థాన్‌ మహాభియాన్‌(పీఎం-కుసుమ్‌)
2026 ఆగస్టు 2 నాటికి:
* వ్యవసాయ వినియోగం కోసం దాదాపు 11.49 లక్షల ఆఫ్‌–గ్రిడ్‌ సౌర పంపులను ఏర్పాటు చేశారు.
* ఫీడర్‌ స్థాయి సౌరీకరణ కింద 15.89 లక్షలకు పైగా వ్యవసాయ పంపులను పరిధిలోకి తీసుకొచ్చారు.
* రైతుల భూముల్లో దాదాపు 1,726 మెగావాట్ల వికేంద్రీకృత సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
* దేశవ్యాప్తంగా 21.77 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందారు.

అందరికీ ఆహార భద్రత
* జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మందిని పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా, రాయితీ ఆహారధాన్యాల పంపిణీ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2026 ఫిబ్రవరి నాటికి 80.56 కోట్ల మందిని గుర్తించాయి.
* 2025 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 79.8 కోట్ల మంది లబ్ధిదారులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్నారు.
* సార్థక్‌ పీడీఎస్‌—రేషన్‌ రవాణా, నిర్వహణ, ఆదాయం, ప్రజా పంపిణీ వ్యవస్థ స్వయంచాలకీకరణకు సహాయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ₹25,530 కోట్లు ఖర్చు చేయనుంది.
* ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోని 81.35 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలన్న భారత్‌ నిబద్ధతను నెరవేర్చేందుకు ఈ పథకం కృషి చేస్తుంది.

సహకార సంఘాలు, ఎఫ్‌పీఓలతో బలమైన గ్రామీణ సంస్థలు
* 2026 జూలై నాటికి దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలను(ఎఫ్‌పీఓ) నమోదు చేశారు.
* 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 79,630 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) కంప్యూటరీకరణకు అనుమతులు ఇచ్చారు.
* 2026 ఆగస్టు 5 నాటికి 63,707 పీఏసీఎస్‌లను ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ ఆధారిత జాతీయ సాఫ్ట్‌వేర్‌లో చేర్చారు.

వ్యవసాయ క్షేత్రాలకు మార్కెట్ల అనుసంధానం
జాతీయ వ్యవసాయ మార్కెట్‌(ఈ-నామ్‌)

* 2026 జూన్‌ నాటికి 1,656 మార్కెట్‌ యార్డులను ఈ–నామ్‌తో అనుసంధానించారు.
* ఈ–నామ్‌లో 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు నమోదయ్యారు.

వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలు(ఏఎంఐ)
* గత పదేళ్లలో 369.18 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన 12,353 గిడ్డంగుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 2026 జూలై నాటికి అనుమతులు ఇచ్చారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్‌)
* 18,893 గిడ్డంగులు, 3,110 శీతల గిడ్డంగులు/శీతల సరఫరా గొలుసు ప్రాజెక్టులు, 2,105 సమీకృత ప్రాథమిక–ద్వితీయ శుద్ధి యూనిట్లకు వడ్డీ రాయితీ మద్దతును విస్తరించారు.

ఆహార శుద్ధి రంగ సంస్కరణలు
ఆహార శుద్ధి రంగానికి పెరిగిన ఆర్థిక మద్దతు

* ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు 2014–15లో ₹785.86 కోట్ల నుంచి 2026–27లో ₹4,064 కోట్లకు పెరిగాయి.

ఆహార శుద్ధి పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐఎస్ఎఫ్‌పీఐ)
* 2026 జూన్‌ వరకు ₹3,271.44 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు.
* పథకం కింద చేపట్టిన పెట్టుబడులతో ఏటా 34 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార శుద్ధి సామర్థ్యం ఏర్పడింది.
* పీఎల్‌ఐ మద్దతు పొందిన ఉత్పత్తుల విక్రయాలు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ₹58,758 కోట్ల నుంచి 2025–26లో ₹1,08,854 కోట్లకు పెరిగాయి.

ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన(పీఎంకేఎస్‌వై)
* 2026 జూన్‌ నాటికి పంట కోత అనంతర మౌలిక సదుపాయాలు, శుద్ధి కేంద్రాలకు సంబంధించిన 1,256 ప్రాజెక్టులు పూర్తయ్యాయి లేదా నిర్వహణలోకి వచ్చాయి. వీటితో దాదాపు 37.76 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.
* ఏటా 294.21 లక్షల మెట్రిక్‌ టన్నుల శుద్ధి–నిల్వ సామర్థ్యాన్ని సృష్టించారు. దేశవ్యాప్తంగా 9.16 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.

ప్రపంచ మార్కెట్‌లోకి భారత వ్యవసాయం


* వ్యవసాయ ఎగుమతుల విలువ 2014–15లో 32.08 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నుంచి 2025–26లో 54.70 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెరిగింది. దాదాపు 70.5 శాతం వృద్ధి నమోదైంది.
* మొత్తం ఎగుమతుల్లో శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల వాటా 2014–15లో 13.7 శాతం నుంచి 2024–25లో 20.4 శాతానికి పెరిగింది. ఇది దాదాపు 49 శాతం వృద్ధి.

వ్యవసాయ క్షేత్రం వద్దకే సాంకేతికత

డిజిటల్‌ వ్యవసాయ మిషన్‌ కింద
2026 ఆగస్టు 3 నాటికి:
* దేశవ్యాప్తంగా 10.31 కోట్లకు పైగా రైతు గుర్తింపు సంఖ్యలను రూపొందించారు. 2025–26 రబీ సీజన్‌లో 648 జిల్లాల్లో డిజిటల్‌ పంటల సర్వే నిర్వహించి 31.3 కోట్లకు పైగా భూభాగాలను పరిధిలోకి తీసుకొచ్చారు.

కృత్రిమ మేధ ఆధారిత కార్యక్రమాలు:
* జాతీయ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ(ఎన్‌పీఎస్ఎస్‌): 
2026 జూలై నాటికి 10 వేల మందికి పైగా వ్యవసాయ విస్తరణ సిబ్బంది ఈ సాధనాన్ని వినియోగిస్తున్నారు. 73 పంటలకు సంబంధించిన 436 చీడపీడల నియంత్రణలో ఇది తోడ్పడుతోంది.
* భారత్‌ విస్తార్‌: 2026 జూలై నాటికి ఈ వేదిక మూడు లక్షలకు పైగా రైతులకు సేవలందించి, 72 లక్షలకు పైగా రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

పరిజ్ఞానంతో రైతులకు సాధికారత
కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే)

2026 జూన్‌ నాటికి:
* భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసింది.
* 2021–22 నుంచి 2023–24 మధ్య దాదాపు 58.02 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
* 2024–25 తొలి పది నెలల్లో అదనంగా 18.56 లక్షల మంది రైతులకు శిక్షణ అందించారు.

వ్యవసాయ వైవిధ్యీకరణ, అనుబంధ రంగాల వృద్ధి
గ్రామీణ ఆర్థిక వృద్ధికి పశుసంవర్ధక, పాడి రంగాల ఊతం

* పశుసంవర్ధక రంగం 2014–15 నుంచి 12.77 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌)ను నమోదు చేసింది. కేంద్ర బడ్జెట్‌ 2026–27లో పశుసంవర్ధక, పాడి విభాగానికి ₹6,153.46 కోట్లు కేటాయించారు.
* దేశీయ, గుర్తించని జాతుల పశువుల ఉత్పాదకత 2014–15లో ఒక్కో పశువుకు ఏటా 927 కిలోగ్రాముల నుంచి 2024–25లో 1,343.2 కిలోగ్రాములకు పెరిగింది.
* గేదెల ఉత్పాదకత 2014–15లో ఒక్కో గేదెకు ఏటా 1,880 కిలోగ్రాముల నుంచి 2024–25లో 2,365.2 కిలోగ్రాములకు పెరిగింది.
* పశువుల సగటు పాల ఉత్పాదకత 2014–15లో ఒక్కో పశువుకు ఏటా 1,648 కిలోగ్రాముల నుంచి 2024–25లో 2,251 కిలోగ్రాములకు చేరింది.


* ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 25 శాతం వాటాతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది.
* తలసరి పాల లభ్యత ప్రపంచ సగటు రోజుకు 394 గ్రాములు కాగా, భారత్‌లో 2024–25లో రోజుకు 485 గ్రాములకు చేరింది.
* పాల ఉత్పత్తి 70 శాతం పెరిగి, 2014–15లో 146.31 మిలియన్‌ టన్నుల నుంచి 2024–25లో 248 మిలియన్‌ టన్నులకు చేరింది.
* కోళ్ల పెంపకం, మాంసం ఉత్పత్తి కూడా విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.
* గుడ్ల ఉత్పత్తి 90 శాతం పెరిగి, 2014–15లో 78.48 బిలియన్ల నుంచి 2024–25లో 149.11 బిలియన్లకు చేరింది.
* తలసరి గుడ్ల లభ్యత 2014–15లో ఏటా 62 నుంచి 2024–25లో 106కు పెరిగింది.
* మాంసం ఉత్పత్తి 2014–15లో 6.69 మిలియన్‌ టన్నుల నుంచి 2024–25లో 10.50 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

మత్స్య రంగ మౌలిక సదుపాయాలు, మార్కెట్ సౌక‌ర్యం, రుణ మద్దతు


నీలి విప్లవ కార్యక్రమాల కింద మత్స్య రంగానికి కేంద్ర బడ్జెట్‌ 2026–27లో రికార్డు స్థాయిలో ₹2,761.80 కోట్లు కేటాయించారు.
* చేపల ఉత్పత్తి 2013–14 ఆర్థిక సంవత్సరంలో 95.79 లక్షల టన్నుల నుంచి 2024–25లో 197.75 లక్షల టన్నులకు చేరింది.
* సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2013–14లో 3.64 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నుంచి 2025–26లో దాదాపు 8.46 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెరిగాయి.

మత్స్య రంగ మౌలిక సదుపాయాలు–మార్కెట్‌ ప్రాప్యత

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)
* కేంద్ర బడ్జెట్‌ 2026–27లో ₹2,500 కోట్లు కేటాయించారు.

2026 ఏప్రిల్‌ నాటికి ఆమోదించిన ముఖ్య కార్యకలాపాలు:
* 28,489 చేపల రవాణా, నిర్వహణ యూనిట్లు
* 1,394 సజీవ చేపల విక్రయ యూనిట్లు, 6,018 చేపల విక్రయ కేంద్రాలు, 117 రిటైల్‌ చేపల మార్కెట్లు
* 775 శీతల గిడ్డంగులు, ఐస్‌ ప్లాంట్లు, 24 టోకు చేపల మార్కెట్లు

మత్స్య రంగానికి సంస్థాగత రుణ మద్దతు
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద 6.83 లక్షల దరఖాస్తులు రాగా, 6.77 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో 4.82 లక్షల దరఖాస్తులకు రుణాలు మంజూరు చేశారు. 2026 ప్రారంభం నాటికి రుణ అవసరాన్ని వాస్తవ రుణ సదుపాయంగా మార్చడంలో గణనీయ పురోగతిని ఇది సూచిస్తోంది.
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు 4.39 లక్షల మంది మత్స్యకారులకు చేరాయి. 33 లక్షల మంది లబ్ధిదారులకు బీమా రక్షణ కల్పించారు. చేపల వేట తక్కువగా ఉండే కాలంలో సగటున 7.44 లక్షల మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి సహాయం అందించారు.

మౌలిక సదుపాయాలు, వ్యాపార ఔత్సాహికతతో పశుసంవర్ధక రంగానికి మరింత బలం

జాతీయ పశుసంవర్ధక మిషన్‌
2026 ఆగస్టు 4 నాటికి:
* కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదల కోసం 4,084 జాతి వృద్ధి క్షేత్రాలకు ఆమోదం ఇచ్చారు.
* 1.61 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేశారు.

జాతీయ పశుసంవర్ధక మిషన్‌ కింద ఔత్సాహికత అభివృద్ధి కార్యక్రమం
2026 ఆగస్టు 11 నాటికి:
* మొత్తం ₹2,948.68 కోట్ల వ్యయంతో కూడిన 4,321 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. వీటికి ₹1,386.18 కోట్ల రాయితీని మంజూరు చేశారు.

పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఏహెచ్ఐడీఎఫ్‌)
* 2026 ఆగస్టు 4 నాటికి రోజుకు 418 లక్షల లీటర్ల పాల శుద్ధి, విలువ జోడింపు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.

భారత్‌ పశుధన్‌
2026 ఆగస్టు 6 నాటికి:
* నమోదైన పశు యజమానులు: 9.84 కోట్లు
* జారీ చేసిన పశు ఆధార్‌లు: 38.53 కోట్లకు పైగా
* వేసిన మొత్తం టీకాలు: 168.67 కోట్లు

జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌పీడీడీ)
2026 జూన్‌ నాటికి:
* 36,611 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.
* 34,557 గ్రామస్థాయి పాడి సహకార సంఘాలను బలోపేతం చేశారు.
* రోజుకు 168 లక్షల లీటర్ల పాల శీతలీకరణ సామర్థ్యాన్ని సృష్టించారు.
* 76,748 పాల నాణ్యత పరీక్ష పరికరాలను పంపిణీ చేశారు.

పశు సంతానోత్పత్తి, ఉత్పాదకత, ఆరోగ్యంలో పురోగతి
* రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కింద 2026 ఆగస్టు 4 నాటికి గ్రామీణ భారతంలో 47,687 మంది బహుళ ప్రయోజన కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు. 24 ఐవీఎఫ్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. 48 వీర్య ఉత్పత్తి కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. 28 ఆడ దూడల పెంపకం కేంద్రాలకు ఆమోదం ఇచ్చారు.
* గత ఐదేళ్లలో దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 17.27 కోట్లకు పైగా కృత్రిమ గర్భధారణలు చేపట్టారు. దాదాపు 5.98 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.
* వేగవంతమైన జాతి అభివృద్ధి కార్యక్రమం: 2026 ఆగస్టు 4 నాటికి 7,959 పిండాలను బదిలీ చేశారు. 1,666 గర్భధారణలు విజయవంతమయ్యాయి. 1,223 దూడలు జన్మించాయి. వీటిలో 1,142 ఆడ దూడలు.

పశు ఆరోగ్యం, ప్రమాద నివారణకు మరింత బలం
పశువుల ఉత్పాదకత, రైతుల ఆదాయ స్థిరత్వం వ్యాధుల నియంత్రణతో ముడిపడి ఉన్నాయి.

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం(ఎన్ఏడీసీపీ)
* 2026 మార్చి నాటికి 132.49 కోట్ల గాలికుంటు వ్యాధి టీకా డోసులను పశువులకు వేశారు.
* బ్రూసెల్లోసిస్‌ నియంత్రణ కార్యక్రమం: పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 మార్చి వరకు దేశంలో 4–8 నెలల వయసున్న 3.17 కోట్ల ఆడ పశు దూడలకు బ్రూసెల్లోసిస్‌ టీకాలు వేశారు. గత ఐదేళ్లలోనే అర్హత కలిగిన ఆడ దూడలకు 296.74 లక్షల టీకా డోసులను అందించి, బ్రూసెల్లోసిస్‌ నివారణతో పాటు పశు ఆరోగ్యాన్ని బలోపేతం చేశారు.

సంచార పశువైద్య యూనిట్లు(ఎంవీయూ)
* 2026 జూలై నాటికి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 4,019 సంచార పశువైద్య యూనిట్లు పనిచేస్తున్నాయి. 1962 ఉచిత ఫోన్‌ నంబర్‌ ద్వారా ఇంటి వద్దకే పశువైద్య సేవలను అందిస్తున్నాయి.
* ఈ యూనిట్ల ద్వారా 119.77 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. 245.05 లక్షల పశువులకు చికిత్స అందించారు. దీంతో రైతుల్లో విశ్వాసం గణనీయంగా పెరిగి, పశుసంవర్ధక రంగం లాభదాయక ఉపాధి మార్గంగా బలోపేతమవుతోంది.

References

Cabinet

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292437&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2265788

 

Ministry of Agriculture and Farmers Welfare

https://agriwelfare.gov.in/Documents/DAFW_AnnualReport_2025_26_En.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237739&reg=48&lang=2

https://agriwelfare.gov.in/en/StatHortEst

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2260618&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290633&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2289031&reg=48&lang=2

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU1656_xhexVu.pdf?source=pqals

https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU360_kN0h0R.pdf?source=lsapps

https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU247_t4SFGX.pdf?source=lsapps

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239788&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2296209&reg=3&lang=1

https://icar.org.in/en/krishi-vigyan-kendras-kvks

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS450_OAibYg.pdf?source=pqals

 

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2293813&reg=6&lang=1

 

Ministry of Consumer Affairs, Food & Public Distribution

https://sansad.in/getFile/annex/270/AS119_uIoKD9.pdf?source=pqars

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2210211

 

Ministry of Chemicals and Fertilizers

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294268&reg=48&lang=2

 

Ministry of Cooperation

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291125&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294906&reg=1&lang=1

 

Ministry of Commerce and Industry

https://agriexchange.apeda.gov.in/India/ExportAnalyticalReport/Index

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2267484

 

Ministry of Food Processing Industries

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291793&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291794&reg=48&lang=2

 

Ministry of Fisheries, Animal Husbandry & Dairying

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294181&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247627&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2264535&reg=3&lang=1

htts://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290496&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291173&reg=48&lang=2https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291173&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2290431&reg=1&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286991&reg=48&lang=2

https://dahd.gov.in/sites/default/files/2026-04/AnnualReport2025-26.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244326&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2294737&reg=6&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241795&reg=6&lang=1

https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU2579_owNrz4.pdf?source=lsapps

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2212290&reg=48&lang=2

https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU2579_owNrz4.pdf?source=lsapps

Bharat Pashudhan

National Livestock Mission

AS349_IOMzfo.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287675&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2293813&reg=6&lang=1

Annual Report - 2- ch 1-3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2213532&reg=3&lang=1

 

PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269182&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288740

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293256

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2278422&reg=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157597&ModuleId=3&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2234117&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269182&reg=48&lang=1

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/apr/doc202646840201.pdf

The New Era of Indian Agriculture and Allied Sectors

 

***

(तथ्य सामग्री आईडी: 150917) आगंतुक पटल : 39


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Kannada , Malayalam , Assamese