• Sitemap
  • Advance Search
Social Welfare

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025

प्रविष्टि तिथि: 07 OCT 2025 15:11 PM

పాఠశాల స్థాయి ఆవిష్కర్తల కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమం

 

ముఖ్యాంశాలు

  • స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి భారత్ ఇతివృత్తాలపై నమూనాలను నిర్మించడానికి 1 కోటి మంది విద్యార్థులు (6-12 తరగతులు) పాల్గొనే భారతదేశపు అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్ .

  • అక్టోబర్ 13, 2025న దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం: లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అన్ని పాఠశాలల్లో దేశవ్యాప్తంగా సమకాలీకరించబడిన లైవ్ బిల్డథాన్

  • 10 మంది జాతీయ స్థాయి విజేతలు, 100 మంది రాష్ట్ర స్థాయి విజేతలు, 1000 మంది జిల్లా స్థాయి విజేతలతో రూ. 1 కోటి విలువైన అవార్డుల సమూహం .

 

పరిచయం

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 అనేది విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం (DoSEL), అటల్ ఇన్నోవేషన్ మిషన్, NITI ఆయోగ్ సహకారంతో నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆవిష్కరణ ఉద్యమం .

 

ఈ అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధ్ భారత్ అనే నాలుగు ఇతివృత్తాలపై విద్యార్థులను ఆలోచనలను రూపొందించేందుకు, నమూనాలను రూపొందించేందుకు ప్రోత్సహించడం ద్వారా పాఠశాల స్థాయిలో ఆవిష్కరణ సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

బిల్డథాన్ మన యువతలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సమస్య పరిష్కారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా వారు సంపన్నమైన, అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి కీలక చోదకులుగా మారతారు.

 

బిల్డథాన్ జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా ప్రయోగాత్మక, అనుభవపూర్వక అభ్యాసాన్ని అందిస్తుంది. ఆకాంక్షాత్మక జిల్లాలు, గిరిజన, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పాల్గొనడం జరుగుతుంది.

బిల్డథాన్ 2025 - కాల పట్టిక

  • సెప్టెంబర్ 23, 2025 : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వికసిత్ భారత్ బిల్డథాన్ ప్రారంభం

  • సెప్టెంబర్ 23 – అక్టోబర్ 11 : పోర్టల్‌లో ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు

  • అక్టోబర్ 11 - అక్టోబర్ 12 : విద్యార్థులు సిద్ధం కావడానికి, థీమ్‌లను ఎంచుకోవడానికి, పరిష్కారాలను నిర్మించడంలో సహాయపడటానికి బృంద నిర్మాణం, రిజిస్ట్రేషన్, మార్గదర్శకత్వం, మేధోమథన సెషన్‌లను నిర్వహించడం, ఆలోచన శిబిరాలు, ఆవిష్కరణ వృత్తాలు వంటి సన్నాహక కార్యకలాపాలు.

  • అక్టోబర్ 13 : లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అన్ని పాఠశాలల్లో దేశవ్యాప్తంగా సింక్రొనైజ్డ్ లైవ్ బిల్డథాన్.

  • అక్టోబర్ 13 – అక్టోబర్ 31 : పోర్టల్‌లో పాఠశాలల ఎంట్రీల సమర్పణ.

  • నవంబర్ 1 - డిసెంబర్ 31 : నిపుణుల బృందం ద్వారా ఎంట్రీల మూల్యాంకనం.

  • జనవరి 2026 : అగ్రశ్రేణి జట్ల ప్రకటన,  సత్కారం

 

ముఖ్య లక్షణాలు

  • ప్రత్యేక పోర్టల్ : తుది ఎంట్రీల (ఆలోచనలు లేదా నమూనాలు) నమోదు, సమర్పణ కోసం ఒక జాతీయ పోర్టల్ ఉంది.

  • పాల్గొనే విధానం : 3-5 మంది విద్యార్థుల బృందం బిల్డథాన్‌లో పాల్గొని, వీడియోల రూపంలో ఎంట్రీలను (ఆలోచనలు/నమూనాలను) సమర్పిస్తుంది. ఒక పాఠశాల నుంచి జట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి ఉండదు.

  • మెంటర్‌షిప్ మద్దతు : విద్యార్థులు పాఠశాల స్థాయిలో తమ ప్రాజెక్టులను నిర్మించుకోవడంలో సహాయపడటానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, మెంటర్ ఆఫ్ చేంజ్ నెట్‌వర్క్, ఉన్నత విద్యా సంస్థలు, కార్పొరేట్‌ల నుంచి స్వచ్ఛంద సేవకులు, మెంటర్లు పూర్తి స్థాయి మద్దతును అందిస్తారు.

  • జాతీయ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం : జాతీయ స్థాయి వర్చువల్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ ఉంటుంది. దీనిలో అన్ని పాఠశాలలు (6 నుంచి 12వ తరగతి వరకు) పాల్గొంటాయి.

  • గ్లోబల్ స్ట్రీమింగ్ : ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వార్తలు, మీడియా ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. 

  • సమ్మిళిత దృష్టి: ఆకాంక్షాత్మక బ్లాక్‌లు, గిరిజన ప్రాంతాలు, సరిహద్దు గ్రామాలు, మారుమూల ప్రాంతాల పాఠశాలలకు ప్రత్యేక శ్రద్ధ, మద్ధతు అందిస్తారు. 

  • జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు: పాఠశాలలు నూతన ఆలోచనల (Innovation) కార్యక్రమాలను నిర్వహిస్తాయి. రాష్ట్రాలు పలు పాఠశాలలను మరియు ప్రముఖులను ఆహ్వానించి, సమాజ స్థాయి ఇన్నోవేషన్ ఈవెంట్స్ ను నిర్వహించవచ్చు.

  • ఎంట్రీల సమర్పణ : ఈవెంట్ తర్వాత, పాఠశాలలు వారి ఆవిష్కరణ ఎంట్రీల వీడియోలను (ఆలోచనలు లేదా నమూనాలు) సమర్పిస్తాయి.

ఎలా పాల్గొనాలి

అర్హత : భారతదేశం అంతటా 6-12 తరగతి వరకు అన్ని పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. విద్యార్థులు ఒకే పాఠశాల నుంచి 3-5 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహాయంతో నమోదు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాలకు జట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు.

జట్టు నమోదు : పాఠశాలలు/ఉపాధ్యాయులు విద్యార్థులను జట్లుగా ఏర్పాటు చేయమని ప్రోత్సహించాలి. వారి జట్లను అధికారిక బిల్డథాన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి, ఆ తర్వాత ప్రతి జట్టుకు ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. వికసిత్ భారత్ బిల్డథాన్ కోసం పాఠశాలల రిజిస్ట్రేషన్ లింక్ - vbb.mic.gov.in.

థీమ్ ఎంపిక : ప్రతి బృందం నాలుగు బిల్డథాన్ థీమ్‌లలో ఒకదాన్ని ఎంచుకుని, ఏదైనా సమస్య ప్రకటనను గుర్తించాలి.

మేధోమథనం & నిర్మాణం : ఈ బృందం సమాజ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

సమర్పణకు సిద్ధం : జట్లు తాము పరిష్కరిస్తున్న సమస్య, వారు సృష్టించిన వినూత్న పరిష్కారం/నమూనా, అది ఎలా పనిచేస్తుంది, దాని ప్రభావాన్ని వివరిస్తూ 2–5 నిమిషాల వీడియోను రూపొందించాల్సి ఉంటుంది.

సమర్పణ : ప్రాజెక్ట్ వీడియో/సారాంశాలను అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు పోర్టల్‌లో సమర్పించాలి.

 

అవార్డులు

నిపుణుల బృందం ఎంట్రీలను మూల్యాంకనం చేస్తుంది. అగ్రశ్రేణి విద్యార్థి జట్లకు బహుమతులు ప్రకటిస్తారు. ఈ పాఠశాలలు, విద్యార్థులు కార్పొరేట్ స్వీకరణ, మార్గదర్శకత్వం, వారి ఆవిష్కరణలను మరింత బలోపేతం చేయడానికి వనరుల ద్వారా దీర్ఘకాలిక మద్దతును పొందుతారు.

10 మంది జాతీయ స్థాయి విజేతలు, 100 మంది రాష్ట్ర స్థాయి విజేతలు, 1000 మంది జిల్లా స్థాయి విజేతలతో రూ. 1 కోటి విలువైన అవార్డుల సమూహం ఉంటుంది .

  • ఏవైనా సందేహాల కోసం సంప్రదించండి: vbb.mic@aicte-india.org

  • రిజిస్ట్రేషన్ లింక్: vbb.mic.gov.in

(तथ्य सामग्री आईडी: 150621) आगंतुक पटल : 2


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Urdu , Assamese , Nepali , Malayalam , Kannada