పనాజీ అంతటా తుది ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకోవడంతో, 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (ఐఎఫ్ఎఫ్ఐ) ఆతిథ్యమిచ్చేందుకు గోవా సర్వసన్నద్ధమైంది. ఉత్సవ ప్రాంగణాలు, రాజధాని నగరం వ్యాప్తంగా కళాకారులు, నిర్వాహక బృందాలు అలంకరణ పనులకు తుది మెరుగులు దిద్దారు. ఈ ఏడాది ఉత్సవ ఇతివృత్తం 'సరిహద్దులకు అతీతమైన కథలు' స్ఫూర్తిని చాటేలా రూపొందించిన ప్రత్యేక కళాఖండాలు, నడక మార్గంలో ఫిల్మ్-రీల్ సొరంగాలు, ప్రతినిధుల కియోస్క్‌లు, స్వాగత తోరణాలు నగరానికి సరికొత్త శోభను తీసుకొచ్చాయి.
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ప్రారంభానికి సిద్ధమైన గోవా రాజధాని పనాజీ నగరం... సినిమా, సంస్కృతుల సమ్మేళనంతో దేదీప్యమాన కళా కేంద్రంగా రూపాంతరం చెందింది. ఉత్సవ ప్రధాన వేదికలైన ఈఎస్‌జీ కాంప్లెక్స్, కళా అకాడమీతో పాటు పనాజీ వీధులన్నీ భారతీయ సినిమా ఘన వారసత్వాన్ని చాటిచెప్పే అద్భుతమైన ఇతివృత్తాల ఆధారిత కళాఖండాల ఏర్పాటుతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
v 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఐఎఫ్ఎఫ్ఐ) వేదిక వద్ద ఆకట్టుకుంటున్న నెమలి ఆకృతిలోని భారీ స్వాగత తోరణం.
v గోవాలోని పనాజీలో రంగురంగుల ఆకృతుల మధ్య 57వ ఐఎఫ్ఎఫ్ఐ చిహ్నంతో సందర్శకులను ఆహ్వానిస్తున్న కళాకృతి.
v పనాజీలోని ఉత్సవ ప్రాంగణంలో 57వ ఐఎఫ్ఎఫ్ఐ, ఎన్‌ఎఫ్‌డీసీ అధికారిక తోరణం కింద విభిన్న చిత్రాలను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లు.
v ఉత్సవ ప్రారంభానికి ముందు పనాజీలో 57వ ఐఎఫ్ఎఫ్ఐ-2026 కళాఖండాలు, రంగురంగుల ఆకృతులతో అలంకరించిన ట్రాఫిక్ ఐలాండ్ దృశ్యం.
v గోవాలోని పనాజీ ఉత్సవ వేదిక వద్ద పచ్చని చెట్ల నడుమ నడకదారి వెంబడి 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అధికారిక లోగోతో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల నమోదు కేంద్రాలు, సమాచార కియోస్క్‌లు.
v 57వ ఐఎఫ్ఎఫ్ఐ తుది ఏర్పాట్లలో భాగంగా ఉత్సవ ప్రాంగణంలోని భారీ సినిమా-రీల్ వాక్-త్రూ టన్నెల్ లోపల చిత్రాల పోస్టర్లను అమర్చుతున్న సిబ్బంది.
v ఉత్సవ ప్రారంభానికి ముందు పనాజీలో అలంకరించిన ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఏర్పాటు చేసిన 57వ ఐఎఫ్ఎఫ్ఐ కళాఖండం.
v రంగురంగుల నెమలి ఈకల ఆకృతులు, జాలువారే పైకప్పు అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులతో ప్రతినిధులకు, సినీ ప్రియులకు స్వాగతం పలుకుతున్న భారీ స్వాగత తోరణం.
v 57వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలకు ముందు పనాజీ ఉత్సవ ప్రాంగణంలో వెలుగులీనుతున్న వారసత్వ కట్టడాలు, చిరుదీపాల అలంకరణల మధ్య 'స్వర్ణ మయూరం' చిహ్నంతో మెరుస్తున్న '57' కళాకృతి.
v గోవాలో 57వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల సన్నాహాల్లో భాగంగా చిరుదీపాల పందిళ్లు, అధికారిక బ్యానర్లతో ఉత్సవ కారిడార్‌గా మారిన పనాజీలోని చెట్ల వరుసల వీధులు.
v 57వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలకు పనాజీ సిద్ధమవుతున్న తరుణంలో, మాండోవి నదీ తీరం వెంబడి వీధుల్లో వెలుగులీనుతున్న ఎల్‌ఈడీ దీపాలు, నెమలి థీమ్ అలంకరణ బోర్డులు.