నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2026 12:27PM by PIB Hyderabad
అగ్నివీర్ వాయు విభాగానికి యోగాభ్యాస శిక్షణ కోర్సు, ధ్రువపత్రాల ప్రదానానికి తోడ్పడే ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) కుదుర్చుకుంది.
ఎంఓయూపై సంతకాల కార్యక్రమాన్ని వైమానిక దళం ప్రధానకేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ ఆఫీసర్-ఇంచార్జి అధ్యక్షత వహించారు. అవగాహన ఒప్పంద పత్రంపై భారతీయ వైమానిక దళం పక్షాన ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్ (విద్య)తో పాటు, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం (సీఎస్‌యూ) తరఫున విశ్వవిద్యాలయ ఉప కులపతి సంతకాలు చేశారు.
ఉన్నత విద్యాసంస్థల సహకారంతో అగ్నివీర్ వాయు ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యావకాశాల కల్పన దిశగా ఐఏఎఫ్ నిరంతరం సాగిస్తున్న ప్రస్థానంలో ఓ కీలక మలుపును తాజా సమన్వయం సూచిస్తున్నది.
***