నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 7:53PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో నవంబర్ 19, 2026న సాయంత్రం 4:30 గంటలకు సామాజిక న్యాయ, సాధికారత శాఖ నిర్వహించే సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.
రెండు రోజుల పాటు 2026 నవంబర్ 18, 19 తేదీల్లో జరిగే ఈ సదస్సులో సామాజిక న్యాయ, సాధికారత, దివ్యాంగుల సాధికారత రంగాలకు సంబంధించి రాష్ట్రాల రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారు. సహకార సమాఖ్య వాదాన్ని బలోపేతం చేయటం, జాతీయ ప్రాధాన్యతలపై సమష్టి బాధ్యతను పెంపొందించటం, కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ద్వారా ఫలితాలను వేగవంతం చేయటమే లక్ష్యంగా ప్రధానమంత్రి దీర్ఘదృష్టితో రూపొందించిన శాఖపరమైన సదస్సుల శ్రేణిలో ఇది మూడోది.
ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఇతివృత్తాలపై చర్చలు:
1. నషా ముక్త్ భారత్ కోసం నివారణ, మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించే వ్యూహంపై పునరాలోచన.
2. వన్ నేషన్ వన్ స్కాలర్షిప్ పోర్టల్ - సులభతరమైన ఉపకార వేతనాలు, విద్యార్థుల సాధికారత.
3. దివ్యాంగుల సమస్యల పరిష్కారం, ముందస్తు చర్యలు.
4. సుగమ్య భారత్ ఫర్ వికసిత్ భారత్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు, ఉత్తమ ఆచరణ విధానాలను మార్చుకునేందుకు, కీలక రంగాల ప్రాధాన్యతలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలుస్తుంది. అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించటం ద్వారా పాలనను, సేవల పంపిణీని మరింత మెరుగుపరచటంపై ఇది దృష్టి సారిస్తుంది.
***