వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోమ్‌లో ఇటలీకి చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలు, ఇంధన సామగ్రి, నిర్మాణం, విమానయానం, స్వచ్ఛ ఇంధనం,
ఆరోగ్యసంరక్షణ రంగాల్లో జాయింట్ వెంచర్లపై చర్చల్లో ప్రస్తావన

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 2:52PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇటలీలోని రోమ్‌లో 2026 నవంబర్ 17న తన అధికార పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓస్)‌తోను, సీనియర్ అధికారులతోను సమావేశమయ్యారు.
మంత్రి భేటీ అయిన వారిలో వాల్టర్ టోస్టో ఎస్‌పీఏ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లుకా టోస్టో, నార్డింపియాంటీ సిస్టమ్ ఎస్ఆర్ఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ జియాన్ పియెరో గైగ్లియార్డీ, ఎటిటెక్ చైర్మన్ శ్రీ జియానీ లెటీరీ, మెగాల్డీ గ్రీన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ లెటిజియా మెగాల్డీ, బ్రాకో ఇమేజింగ్ ఎస్‌పీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఫుల్‌వియో రెనోల్డీ బ్రాకో ఉన్నారు.
చర్చలలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్య విషయాల్లో భారతదేశంలో ఇటలీ కంపెనీలు తమ పెట్టుబడులను పెంచడం, సాంకేతికత బదలాయింపు, భారతీయ భాగస్వామ్య కంపెనీలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. కంపెనీలు భారతదేశంలో తమ సాంకేతికతను ప్రవేశపెట్టడం పట్ల, తయారీ, విమానాల నిర్వహణ, థర్మల్ ఇంధన నిల్వ, ఫార్మస్యూటికల్ ఇన్‌గ్రీడియట్ల వంటి రంగాలలో భారతీయ పరిశ్రమకు సహకరించడం పట్ల ఆసక్తిని వ్యక్తం చేశాయి.
కంపెనీలు కనబరిచిన ఆసక్తిని శ్రీ పీయూష్ గోయల్ స్వాగతించారు. వాటిని భారతదేశ మౌలిక సదుపాయాలు, విమానయాన, ఆరోగ్యసంరక్షణ రంగాలతో కలిసి భాగస్వామ్యాన్ని పంచుకోవాల్సిందిగా ఆయన ప్రోత్సహించారు.
చర్చల సందర్భంగా .. భవిష్యత్తులో భారతీయ జాయింట్ వెంచర్లకు తగిన భాగస్వాములు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, వ్యయ పరిశీలన సంబంధిత అధ్యయనాలతో పాటు భారతీయ సంస్థలతో సంయుక్త అధ్యయనాలకు అవకాశాలను అన్వేషించాల్సి ఉందని గుర్తించారు.
భారత్, ఇటలీ తమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతూ, 2029 కల్లా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోల స్థాయికి చేర్చాలన్న లక్ష్యం దిశగా కృషి చేస్తున్న వేళ ఈ సమావేశాలు జరిగాయి.

***


(రిలీజ్ ఐడి: 2338262) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil