నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 4:29PM by PIB Hyderabad
మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు నేపథ్యంలో ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఈ ఏడాది ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన ఫిలిప్పీన్స్‌ను ప్రధానమంత్రి అభినందించారు. 2024 నుంచి భారత్‌కు కంట్రీ కోఆర్డినేటర్‌గా ఫిలిప్పీన్స్ పోషిస్తున్న పాత్రను, ఆసియాన్–ఇండియా సంబంధాలను బలోపేతం చేయడంలో అందిస్తున్న నిరంతర సహకారాన్ని ప్రశంసించారు.
2026 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆసియాన్ ఛైర్మన్ హోదాలో ఉన్న అధ్యక్షుడు మార్కోస్ జూనియర్‌ను ప్రధాని మోదీ ఆ సదస్సుకు ఆహ్వానించారు. 2025 ఆగస్టులో అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిలో రక్షణ, భద్రత, అంతరిక్షం, రైల్వే మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, వాణిజ్య, పెట్టుబడులు, తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం వేగవంతం కావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా నాయకులిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు
***