నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 8:53AM by PIB Hyderabad
ఏ మనిషీ ఒక్క క్షణమైనా ఏ పనీ చేయకుండా ఉండజాలరని, ఈ కారణంగా అందరూ తమ జీవితంలో మంచి పనులను, సకారాత్మక పనులను చేయాలని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః’’ అని పేర్కొన్నారు.
పైన చెప్పిన సూక్తికి భావం ఇదీ..
ఏ మనిషీ ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం సేపయినా ఉండలేరు. ప్రకృతిలోని మౌలిక గుణాలు, మన స్వీయ స్వభావానికి అనుగుణంగా ప్రతి వ్యక్తీ నిరంతరం కర్మ చేయక తప్పదు. ఇందువల్ల, మనం మన జీవితంలో సదా మంచి పనులను, సకారాత్మక పనులనే చేయాలి.
***