నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2026 6:24PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల (ఈఎంఆర్ఎస్)ల పరిణామక్రమాన్ని, నాణ్యమైన విద్య, సమగ్రాభివృద్ధి ద్వారా గిరిజన బాలలకు కొత్త అవకాశాలను కల్పించడంలో ఈ పాఠశాలలు పోషిస్తున్న పాత్రను ఈ వ్యాసం తెలియజేస్తుంది. బ్రిడ్జి కోర్సులు, ద్విభాషా బోధన, టెక్నాలజీ ఆధారిత తరగతి గదులు, క్రీడలు, వృత్తిపరమైన శిక్షణ లాంటి ముఖ్యమైన కార్యక్రమాలను వివరిస్తుంది. వీటితో పాటుగా ఐఐటీలు, ఎయిమ్స్, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థుల విజయాల గురించి కూడా తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘నాణ్యమైన విద్య ద్వారా గిరిజన బాలలకు కొత్త అవకాశాలను ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు అందిస్తున్నాయి.
జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఈఎంఆర్ఎస్ పరిణామ క్రమం గురించి, గిరిజన బాలలకు నాణ్యమైన విద్యను, సమగ్రాభివృద్ధిని అందించండంలో అవి పోషిస్తున్న పాత్ర గురించి గౌరవ @VPIndia, శ్రీ @CPR_VP రాశారు.
బ్రిడ్జి కోర్సులు, ద్విభాషా బోధన, సాంకేతిక ఆధారిత తరగతి గదులు, క్రీడలు, వృత్తిపరమైన శిక్షణ లాంటి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. వీటితో పాటు ఐఐటీలు, ఎయిమ్స్, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశిస్తున్న విద్యార్థుల విజయాల గురించి కూడా తెలియజేశారు.
కచ్చితంగా చదవాల్సిన వ్యాసం!’’
***