57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫిలో 25 ఫీచర్‌ చిత్రాలు, 20 నాన్‌ ఫీచర్‌ చిత్రాలను ప్రదర్శించనున్న ఇండయన్‌ పనోరమా


ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డుకు అయిదు చిత్రాల నామినేషన్‌

ఉత్తమ వెబ్‌ సిరీస్‌ (ఓటీటీ) అవార్డుకు అయిదు వెబ్‌ సిరీస్‌ల నామినేషన్‌

ప్రారంభ చిత్రాలుగా ‘ధురంధర్‌’ (హిందీ), ‘బికమింగ్‌’ (లడఖీ) ఎంపిక

నాడు పోస్టు చేయడమైనది: 14 NOV 2026 5:24PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2336342Views: 14

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ప్రధాన విభాగమైన ఇండియన్‌ పనోరమాలో 2026 సంవత్సరానికి 25 ఫీచర్‌ చిత్రాలు, అయిదు చిత్రాలతో కూడిన మెయిన్‌స్ట్రీమ్‌ సినిమా విభాగం సహా మొత్తం 25 ఫీచర్‌ సినిమాలు, 20 నాన్‌ ఫీచర్‌ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ‘ధురంధర్‌’ (హిందీ) ఇండియన్‌ పనోరమా 2026 ప్రారంభ ఫీచర్‌ చిత్రంగా ఎంపికైంది. లీనా యాదవ్‌ దర్శకత్వం వహించిన ‘బికమింగ్‌’ (లడఖీ) ప్రారంభ నాన్‌ ఫీచర్‌ చిత్రంగా ఎంపికైంది.

 

404 సమకాలీన భారతీయ ఫీచర్‌ చిత్రాల ఎంట్రీల నుంచి ఫీచర్‌ చిత్రాలను ఎంపిక చేయగా, 358 ఎంట్రీల నుంచి 20 నాన్‌ ఫీచర్‌ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ ఎంపికల ద్వారా ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌ విభాగాల్లో, వివిధ భాషల్లో రూపొందిన సమకాలీన భారతీయ చిత్రాల విస్తృత శ్రేణిని ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. చలనచిత్ర కళను ప్రోత్సహించే లక్ష్యంతో, సినిమాటిక్‌ విలువలు, ఇతివృత్తం, సౌందర్యపరమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌ చిత్రాలను ఎంపిక చేయడమే ఇండియన్‌ పనోరమా ఉద్దేశం. ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌ చిత్రాల ఎంపిక ప్రక్రియను వేర్వేరు జ్యూరీలు నిర్వహిస్తాయి. ఆయా జ్యూరీలకు సంబంధిత ఛైర్‌పర్సన్లు నాయకత్వం వహిస్తారు.

 

భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త దృక్పథాలు, వినూత్న అభివ్యక్తి రూపాలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లక్ష్యం. 

 

ఇండియన్‌ పనోరమా 2026కు ఎంపికైన 25 ఫీచర్‌ చిత్రాలు

 

12 మంది సభ్యులతో కూడిన ఫీచర్‌ ఫిల్మ్‌ జ్యూరీకి జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, దర్శకుడు, నిర్మాత మధుర్‌ భండార్కర్‌ అధ్యక్షత వహించారు. ఎంపికైన ఫీచర్‌ చిత్రాల విభాగంలో ఇండియన్‌ పనోరమా ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి చెందిన 20 చిత్రాలు, మెయిన్‌స్ట్రీమ్‌ సినిమా విభాగానికి చెందిన అయిదు చిత్రాలు ఉన్నాయి.

 

మెయిన్‌స్ట్రీమ్‌ సినిమా విభాగం

  

No.

Title of film

Language

Director

21

Kantara A Legend Chapter 1

Kannada

Rishab Shetty

22

Baapya

Marathi

Samir Tewari

23

Mana Shankara Vara Prasad Garu (Pandaga Ki Vastunnaru)

Telugu

Anil Ravipudi

24

Dhurandhar

Hindi

Aditya Dhar

25

Deool Band 2

Marathi

Pravin Vitthal Tarde

 

భారతీయ చలనచిత్ర ఉత్తమ తొలి దర్శకుడి అవార్డుకు నామినేషన్లు

 

భారతీయ చలనచిత్ర ఉత్తమ తొలి దర్శకుడి అవార్డుకు ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ కింది అయిదు చిత్రాలను నామినేట్ చేసింది.

 

No.

Original title of film

Language

Director

1

Chennai Love Story

Telugu

Ravi Varma Namburi

2

Pratyabartan

Bengali

Samarpan Sengupta

3

Tighi

Marathi

Jeejivisha Kale

4

Sledge

Kashmiri

Raja Shabir Mohd Khan

5

Hanuman Ansh

Hindi

Dr Vishal Chaturvedi

 ఇండియన్‌ పనోరమా 2026కు ఎంపికైన 20 నాన్‌ ఫీచర్‌ చిత్రాలు

ఆరుగురు సభ్యులతో కూడిన నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ జ్యూరీకి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, విద్యావేత్త హిమాంశు శేఖర్‌ ఖటువా అధ్యక్షత వహించారు. సమకాలీన భారతీయ నాన్‌ ఫీచర్‌ చిత్రాలకు సంబంధించిన 358 ఎంట్రీల నుంచి 20 చిత్రాలను ఎంపిక చేశారు. సమకాలీన భారతీయ విలువలను ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించడం, వాస్తవాలను నమోదు చేయడం, పరిశోధించడం, వినోదాన్ని అందించడం, ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో వర్ధమాన, అనుభవజ్ఞులైన చలనచిత్ర దర్శకుల సామర్థ్యాన్ని ఈ చిత్రాల ఎంపిక ప్రతిబింబిస్తోంది.

***

Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2336342
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026