ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయ్‌దూజ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 8:37AM by PIB Hyderabad

పవిత్ర భాయ్‌దూజ్ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

తోబుట్టువుల మధ్య ఉండే ఆత్మీయ బంధంలోని అనురాగానికి, గాఢమైన ఆత్మీయతకు ఈ పవిత్రమైన పండగ ప్రతీక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ శుభదినాన అందరికీ ఆనందం, సంతోషం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ భాయ్‌దూజ్ శుభాకాంక్షలు.

తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమపూర్వకమైన, బలమైన బంధంలోని మాధుర్యాన్ని, సాన్నిహిత్యాన్ని ఈ పవిత్రమైన పండుగ సూచిస్తుంది.

ఈ శుభ సందర్భంలో అందరికీ ఆనందం, సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2334927) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Nepali , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam