నాడు పోస్టు చేయడమైనది:
08 NOV 2026 2:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్.. బస్తర్‌లోని కరణ్‌పూర్‌లో గల కోబ్రా ఆపరేషన్స్ బేస్‌లో జవాన్లతో కలిసి దీపావళి పండుగ చేసుకున్నారు. వారికి ఆయన ఈ పర్వదినం సందర్భంగా మిఠాయిలు పంచి పెట్టారు.
దేశ ప్రజల రక్షణ కర్తవ్యాన్ని పాలిస్తున్న జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకొన్న కారణంగా ఈ పండుగ మధురతరంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మనలను రక్షిస్తున్న జవాన్లతో కలిసి దీపావళి ఆనందాలను పంచుకోవడం వల్ల పండుగ మాధుర్యం ఇంతలంతలు అవుతున్నది.
#Bastar #NaxalFreeIndia”