ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బస్తర్‌లో భద్రతాదళాల సిబ్బందితో కలిసి దీపావళి పండుగ చేసుకోనున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2026 10:22AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు వెళ్తున్నారు. అక్కడ ఆయన భద్రతాదళాలకు చెందిన వీర జవానులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటారు. భద్రతాదళాల త్యాగాలను, నిస్వార్థ సేవలను, దేశం పట్ల వారు చాటే అచంచల అంకితభావాన్ని ఆయన స్మరించుకొంటూ నివాళులను అర్పించనున్నారు.

ఒకప్పుడు నక్సలిజం వల్ల ప్రభావితం అయిన బస్తర్ ఇప్పుడు సరికొత్త అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ:

‘‘నేను నా సాహసిక భద్రతాదళాలతో కలిసి దీపావళి జరుపుకోవడానికి బస్తర్‌కు వెళ్తున్నాను.

అది ఒకప్పుడు నక్సలిజం ప్రభావం ప్రసరించిన ప్రాంతం. అయితే ఇప్పుడు అక్కడ అభివృద్ధి జోరందుకుంటోంది.

నేను మన వీర భద్రతాదళాల త్యాగం, నిస్వార్థ సేవ, దేశం పట్ల వారు చాటిన అచంచల అంకితభావానికి వందనాన్ని ఆచరించబోతున్నాను.

దీపావళి పర్వదినం సందర్భంగా బస్తర్ వెళ్తున్నాను.

నిన్నటి వరకు నక్సలిజం విరుచుకుపడిన చోట ఇప్పుడు ప్రగతి వర్ధిల్లుతోంది.

వీర జవాన్లకు వారు చేసిన ప్రాణత్యాగానికి, తపస్సుకు ప్రణమిల్లడానికి అక్కడకు వెళ్తున్నాను’’ అని పేర్కొన్నారు


(రిలీజ్ ఐడి: 2334331) సందర్శకుల సూచీ సంఖ్య : : 17