రైల్వే మంత్రిత్వ శాఖ
2026 అక్టోబర్‌లో 145.07 మిలియన్ టన్నుల సరకును చేరవేసిన భారతీయ రైల్వేలు
2025 అక్టోబర్‌తో పోలిస్తే, 2026 అక్టోబర్2లో ఆహార ధాన్యాలలో 26.3 శాతం,
దేశీయ బొగ్గులో 16.0 శాతం, ఇతర సరకుల చేరవేతలో 11.0 శాతం,
దేశీయ కంటెయినర్ల చేరవేతలో 6.3 శాతం వృద్ధి నమోదు
2026 అక్టోబర్ లో పవర్ హౌసులకు బొగ్గు సరఫరాలో 19.5 శాతం వృద్ధి
2026 ఏప్రిల్ మొదలు అక్టోబర్ మధ్య కాలంలో సరకు చేరవేత 978.78 మిలియన్ టన్నుల స్థాయికి..
ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలం పనితీరు కన్నా ఎక్కువ
నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 11:30AM by PIB Hyderabad
భారతీయ రైల్వే కిందటి నెలలో కూడా తన కార్యకలాపాల నిర్వహణ తీరులో పటిష్టతను కొనసాగించింది. సరకు రవాణాలో చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేసింది. సరకును చేరవేసేందుకు జరిపిన రాకపోకలలో వృద్ధి, ఫలితంగా ఆర్జించిన ఆదాయం ఆర్థికాభివృద్ధి సాధనకు భారతీయ రైల్వేలు అందిస్తున్న మద్దతుకు, దేశ ఆధునిక రవాణా (లాజిస్టిక్స్) రంగాన్ని పటిష్టపరచడానికి చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పడుతున్నాయి.
సరకు రవాణాలో చెప్పుకోదగిన వృద్ధి
భారతీయ రైల్వేలు అక్టోబర్ నెలలో సరకు రవాణాలో ఇంతవరకు ఎరుగనంత అధిక రికార్డును నెలకొల్పింది. ఈ నెలలో 145.07 మిలియన్ టన్నుల సరకును చేరవేశారు. ఇది కిందటి సంవత్సరంలో అక్టోబర్‌లో చేరవేసిన 133.93 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.32 శాతం వృద్ధిని సూచిస్తోంది.
ఈ నెలలో అనేక ప్రముఖ వస్తువుల రాకపోకలలో వృద్ధి నమోదయింది. ఆహార ధాన్యాలలో 26.3 శాతం, దేశీయ బొగ్గు లో 16.0 శాతం, ఇతర వస్తువులలో 11.0 శాతం, క్లింకర్2లో 10.4 శాతం, దేశీయ కంటెయినర్లలో 6.3 శాతం, ఇనుప ఖనిజంలో 5.0 శాతం, ఖనిజ నూనెలో 1.9 శాతం, తయారైన ఉక్కులో 0.5 శాతం వృద్ధి చోటుచేసుకుంది.
పవర్ హౌసుల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ అవసరాలను పూర్తి చేయడానికి భారతీయ రైల్వేలు దేశీయ బొగ్గు రవానాను పెంచివేసింది. 2026 అక్టోబర్‌లో సగటున 469.8 రేక్స్ (రైలు కోచుల సమూహం) బొగ్గును నిత్యం చేరవేశారు. కిందటి సంవత్సరంలో ఇదే కాలంలో సగటున రోజువారీ రవాణా 393.2 రేక్స్ గా ఉంది. అంటే, 19.5 శాతం వృద్ధి ఉందని చెప్పుకోవాలి.
2026 అక్టోబర్‌లో ఈ శ్రేష్ఠమైన ప్రదర్శన 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలం (ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య)లో నమోదైన వృద్ధిలో నిలకడతనం కొనసాగినట్లు తెలియజేస్తోంది. ఈ కాలంలో, భారతీయ రైల్వే మొత్తం 978.78 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసింది. గత సంవత్సరంలో ఇదే కాలంలో 935.10 మిలియన్ టన్నుల సరకును చేరవేశారు. అంటే ఈ కాలంలో 4.67 శాతం వృద్ధి చోటుచేసుకుంది.
ప్రయాణికుల చేరవేతలోనూ నమోదవుతున్న వృద్ధి
2026 అక్టోబర్‌లో ప్రయాణికుల చేరవేతలో కూడా నిలకడతనంతో కూడిన వృద్ధి కనిపించింది. భారతీయ రైల్వేలు 64.72 కోట్ల మందిని గమ్యస్థానాలకు తీసుకుపోయాయి. కిందటి సంవత్సరంలో ఇదే కాలంలో ఈ సంఖ్య 63.52 కోట్లుగా ఉంది.
2026 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో భారతీయ రైల్వేలలో 443.8 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేశారు. కిందటి సంవత్సరం ఇదే కాలంలో 431.4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేశారు. శివారేతర విభాగం (నాన్- సబ్ అర్బన్ సెగ్మెంట్)లో 4.2 శాతం వృద్ధి నమోదైంది. శివారు విభాగంలో 1.7 శాతం వృద్ధి చోటుచేసుకుంది.
సరకుల చేరవేతకు సంబంధించిన రాక, పోకలలో వృద్ధి భారతీయ రైల్వేలకు సంబంధించినంత వరకు లాజిస్టిక్స్‌ను బలోపేతం చేయడంతో పాటు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి సాధన కృషికి అండదండలు అందించాలన్న నిబద్ధతను కూడా చాటిచెబుతోంది. సామర్థ్యాలను పెంపొందింప చేసుకోవడం, నిర్వహణ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భారతీయ రైల్వే తమ రవాణా నెట్వర్కును నిరంతర ప్రాతిపదికన విస్తరించుకొంటోంది.
***
(రిలీజ్ ఐడి: 2332527)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada