నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2026 12:54PM by PIB Hyderabad
· అక్టోబర్ 2026 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు ఒప్పందాల(మొత్తం 5.5 లక్షల ఎంటీపీఏకు పైగా)పై భారత కంపెనీలు సంతకం చేశాయి. దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ సరఫరాలో ప్రపంచ నాయకుడిగా భారత్ అవతరించింది.
· 2026లో భారత కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్, దానికి సమానమైన పరిమాణాన్ని సరఫరా చేసేందుకు కొత్తగా 18 కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేశాయి.
· 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 5.5 లక్షల ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించి మొత్తం 23 కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 70 శాతానికి పైగా ఎగుమతులకు కేటాయించినవి.
· ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ. 90,000 కోట్ల (సుమారు 9.5 బిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా.
· భారత సరఫరాదారులు ప్రపంచంలోనే అత్యంత పోటీ ధరలకు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్‌ను అందిస్తున్నారు. ఇది ఐరోపా, జపాన్ మార్కెట్లలో భారతదేశ అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
· ప్రపంచవ్యాప్తంగా, మెథనాల్ షిప్పింగ్ రంగాలకు పరిశుభ్రమైన బంకరింగ్ ఇంధనంగా గ్రీన్ అమ్మోనియా ఎదుగుతోంది.
· కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు థర్మల్ పవర్ ప్లాంట్లలో అమ్మోనియా కో-ఫైరింగ్ కోసం కూడా గ్రీన్ అమ్మోనియాను ఉపయోగిస్తున్నారు.
· పారిశ్రామిక డీకార్బనైజేషన్‌ను సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎరువుల తయారీ, రిఫైనింగ్ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను క్రమంగా విస్తృత స్థాయిలో ఆమోదిస్తున్నారు.
అక్టోబర్ 2026 నాటికి భారత కంపెనీల ద్వారా కుదిరిన మొత్తం గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు ఒప్పందాలు 5,55,610 ఎంటీపీఏకి చేరుకున్నాయి. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంలో సుమారు 11 శాతానికి సమానం. ఇది గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది.
ఈ దేశీయ, అంతర్జాతీయ ఒప్పందాలను పూర్తిగా నెరవేర్చేందుకు రూ. 90,000 కోట్లకు పైగా (సుమారు 9.5 బిలియన్ అమెరికన్ డాలర్లు) మూలధన పెట్టుబడి అవసరం.
2029-30 వరకు రూ. 19,744 కోట్ల ప్రారంభ కేటాయింపులతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్‌జీహెచ్ఎం) కేబినెట్ ఆమోదం పొందింది. 2030 నాటికి వార్షికంగా కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయటమే ఈ మిషన్ లక్ష్యం. అదనంగా ఈ మిషన్ ద్వారా 125 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, రూ. 8 లక్షల కోట్లకు పైగా మొత్తం పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి, సంవత్సరానికి 50 ఎంఎంటీ కర్బన ఉద్గారాల నియంత్రణ సాధించవచ్చని అంచనా.
ప్రధాన ప్రపంచ మార్కెట్లలో భారత సంస్థలు కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాలు, బైండింగ్ గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమైన ఒప్పందాలు ఈ విధంగా ఉన్నాయి:
1. జపాన్‌కు చెందిన ఐహెచ్ఐతో ఏడాదికి 4,88,000 మెట్రిక్ టన్నుల (ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియా సరఫరాకు ఏసీఎంఈ గ్రూప్, ఇండియా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.
2. జపాన్‌కు చెందిన మిత్సుబిషి గ్యాస్ కెమికల్ సంస్థకు 1,00,000 ఎంటీపీఏ గ్రీన్ మెథనాల్ సరఫరాకు కూడా ఏసీఎంఈ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
3. డిసెంబర్ 2029 నుంచి సరఫరాలు ప్రారంభించే లక్ష్యంతో 3,00,000 టీపీఏ గ్రీన్ అమ్మోనియా సరఫరాకు ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ (ఎస్‌పీవీ)ను ఎల్ అండ్ టీ, ఐటీఓసీహెచ్‌యూ ఏర్పాటు చేశాయి.
4. దక్షిణ కొరియాకు చెందిన శాసంగ్ సీ అండ్ టీ కార్పొరేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)... 3 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా విలువైన దీర్ఘకాలిక సరఫరా, కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కొనుగోలు ఒప్పందాల్లో ఒకటి. ఈ ఒప్పందం ద్వారా 2028 నాటికి సరఫరాలు ప్రారంభమవుతాయి.
5. శ్రీలంకలోని ఎస్ఏఆర్ సంస్థకు 2,50,000 ఎంటీపీఏ గ్రీన్ మెథనాల్ సరఫరా చేసే ప్రక్రియలో అగస్త్య ఉంది.
6. హింట్.కో జీఎంబీహెచ్ నిర్వహించిన హెచ్2గ్లోబల్ ఆక్షన్‌లో ఏషియన్ లాట్ గా ఏఎం గ్రీన్ ఏకైక విజేతగా నిలిచింది. దీనిద్వారా జర్మనీకి నాన్-బలాజికల్ ఆధారంగా (ఆర్ఎఫ్ఎన్‌బీఓ) అమ్మోనియా సరఫరాకు దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాన్ని పొందింది. ఈ ఒప్పందం ప్రకారం... హింట్కో సంస్థ పదేళ్ల కాలానికి కనీసం 585 మిలియన్ యూరోల విలువైన అమ్మోనియాను ఏఎం గ్రీన్ నుంచి కొనుగోలు చేస్తుంది. జర్మనీకి మొదటి డెలివరీలు 2029లో ప్రారంభమవుతాయని అంచనా.
7. జర్మనీకి చెందిన యూనిపర్ సంస్థతో 2,50,000 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా సరఫరాకు ఒప్పందంపై ఏఎం గ్రీన్ సంతకం చేసింది.
8. గ్రీన్ అమ్మోనియా దీర్ఘకాలిక సరఫరా కోసం జపాన్ ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జేఈఆర్ఏతో ఒక బైండింగ్ హెడ్ ఆఫ్ అగ్రిమెంట్‌పై ఏఎం గ్రీన్ సంతకం చేసింది.
9. సెలెక్ట్ ఎనర్జీ జీఎంబీహెచ్ సంస్థతో 600 టీపీడీ (సుమారు 2,19,000 ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియా కోసం జౌనో జౌలెస్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎగుమతి గణాంకాలతో పాటు నిర్దేశిత ప్రభుత్వ విధానాల ద్వారా గణనీయమైన దేశీయ డిమాండ్ ఏర్పడింది.
1. మిషన్‌లోని స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన 11 ఎరువుల యూనిట్లకు 6,70,000 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, సరఫరా కోసం ఒప్పందాలు కుదిరాయి.
2. అదేవిధంగా సైట్ కార్యక్రమం ద్వారా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్, ఎన్ఆర్ఎల్ రిఫైనరీలకు 30,000 ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సరఫరా ప్రాజెక్టులను కేటాయించారు.
***