జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునః భరణ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర జలశక్తి మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 12:16PM by PIB Hyderabad

శాస్త్రీయ పద్ధతుల్లో భూగర్భ జలాల పునర్భరణ ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ‘పునః భరణ్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ను కేంద్ర జలశక్తి మంత్రి ప్రారంభించారు. జల మంత్రిత్వ శాఖ పరిధిలోని జల వనరులు, ఆర్‌డీ-జీఆర్ (నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం) జాతీయ జల మిషన్‌ (ఎన్‌డబ్ల్యూఎం) సహకారంతో బిసాగ్‌-ఎన్‌ (బీఐఎస్ఏజీ-ఎన్) ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

ఈ మొబైల్‌ యాప్‌ వినియోగదారులు తమ ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో కృత్రిమ పద్ధతుల్లో భూగర్భ జలాలను పెంచేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు, స్థానిక పరిస్థితుల ఆధారంగా తగిన రీఛార్జ్ (జల పునరుద్ధరణ) నిర్మాణాలను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ యాప్‌లో గ్రామ స్థాయిలో కృత్రిమ జల పునరుద్ధరణ నిర్మాణాల వర్గీకరణ మ్యాప్‌లు (ఏఆర్ఎస్) , భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాధనాలు, వివిధ అంశాలకు సంబంధించిన మ్యాప్‌ పొరలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా భూగర్భ జలాల సుస్థిర నిర్వహణకు సంబంధించి సమాచార ఆధారిత ప్రణాళికలను రూపొందించవచ్చు.

వర్షపాతం, భూగర్భ జలాల మట్టాలు, భూగర్భ జలాల లభ్యత, భూమి వాలు, డ్రైనేజీ మార్గాలు వంటి భౌగోళిక సమాచారాన్ని ఈ వేదిక వినియోగిస్తుంది. తద్వారా జలాలను తిరిగి భూమిలోకి ఇంకించేందుకు అనువైన జల పునరుద్ధరణ ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు సహాయపడుతుంది.

భౌగోళిక సాంకేతికత ఆధారంగా శాస్త్రీయ భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రణాళికలకు ‘పునః భరణ్‌’ వేదిక దోహదపడుతుంది.


(రిలీజ్ ఐడి: 2329521) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada