నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 7:25PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో ఎఫ్37, ఎఫ్38 ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించి, ప్రపంచ రికార్డును నెలకొల్పిన హానేకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది అద్భుతమైన విజయమని, భారత పారా అథ్లెటిక్స్‌కు గర్వించదగిన క్షణమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ హానే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“స్వర్ణ పతకంతో సరికొత్త రికార్డు. ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో ఎఫ్37, ఎఫ్38 ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన హానేకి శుభాకాంక్షలు. ఇది అద్భుతమైన విజయం... భారత పారా అథ్లెటిక్స్‌కు గర్వించదగిన క్షణం. భవిష్యత్తులోనూ హానే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాంక్షిస్తున్నా: పీఎం @narendramodi”