నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 10:14PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో కొత్త ప్రపంచ రికార్డుతోపాటు, ఆసియా పారా క్రీడల రికార్డుతో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన మోనా అగర్వాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ పారా షూటర్‌గా మోనా అగర్వాల్ నిలవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“ఆసియా పారా క్రీడల్లో మోనా అగర్వాల్ చారిత్రాత్మక స్వర్ణ విజయం సాధించారు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి, ఆసియా పారా క్రీడల రికార్డుతో స్వర్ణ పతకం సాధించినందుకు అభినందనలు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ పారా షూటర్‌గా నిలవడం ఆమె విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఆమె భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.