ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్, విజయ్ సుందిలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 7:45PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌ పురుషుల రికర్వ్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన హర్విందర్ సింగ్, విజయ్ సుందిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

వారి అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్న శ్రీ మోదీ... వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"హర్విందర్ సింగ్, విజయ్ సుందిలకు గొప్ప విజయం!

ఆసియా పారా క్రీడల పురుషుల రికర్వ్ డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్న ఈ ద్వయానికి అభినందనలు. వారి అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణం. వారి భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు : ప్రధానమంత్రి @narendramodi"


(రిలీజ్ ఐడి: 2327934) సందర్శకుల సూచీ సంఖ్య : : 14