ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌లో కాంస్యం సాధించిన ప్రమోద్‌ భగత్‌.. మనీషా రామ్‌దాస్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:01PM by PIB Hyderabad

   ఆసియా పారా గేమ్స్‌-2026 మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్‌L3-ఎస్‌యు5 పారా బ్యాడ్మింటన్ విభాగంలో ప్రశంసనీయ ప్రతిభతో కాంస్యం సాధించిన ప్రమోద్ భగత్, మనీషా రామదాస్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలిపారు.

వారిద్దరి జట్టు కృషి, పట్టుదల, పోటీతత్వం టోర్నమెంట్ ఆద్యంతం స్పష్టంగా కనిపించాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఈ ద్వయాన్ని, వారి ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో వారు మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రమోద్ భగత్, మనీషా రామదాస్‌ల విజయం ప్రశంసనీయం! ప్రతిభావంతులైన ఈ జంట ఆసియా పారా గేమ్స్‌-2026లో మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్‌3-ఎస్‌యు5 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం సాధించారు. టోర్నమెంట్ ఆద్యంతం వారిద్దరి జట్టు కృషి, పట్టుదల, పోటీతత్వం ప్రస్ఫుటమయ్యాయి. ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు.. భవిష్యత్తులోనూ వారు మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.

***


(రిలీజ్ ఐడి: 2327399) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam