ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌లో కాంస్యం సాధించిన కృష్ణ నాగర్‌.. నిత్య శ్రీసుమతిలకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:04PM by PIB Hyderabad

   ఆసియా పారా గేమ్స్‌-2026 మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్‌6 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన నిత్య శ్రీసుమతి శివన్, కృష్ణ నాగర్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

వారిద్దరి అంకితభావం ఫలితంగా భారత పారా బ్యాడ్మింటన్‌కు మరో గర్వకారణ విజయం లభించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో వారు మరిన్ని మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్‌6 పారా బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన నిత్య శ్రీసుమతి శివన్, కృష్ణ నాగర్‌కు నా హృదయపూర్వక  అభినందనలు! వారి అంకితభావం ఫలితంగా భారత పారా బ్యాడ్మింటన్‌ గర్వించదగిన మరో విజయం దక్కింది. భవిష్యత్తులో వారిద్దరూ మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.

***


(రిలీజ్ ఐడి: 2327397) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam