ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం సాధించిన శీతల్ దేవికి ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 6:33PM by PIB Hyderabad

2026 ఆసియా పారా క్రీడల్లో మహిళల వ్యక్తిగత పారా కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో, విజయవంతంగా టైటిల్ నిలబెట్టుకుని, వరుసగా రెండో ఎడిషన్‌లోనూ స్వర్ణ పతకం గెలిచిన శీతల్ దేవికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కచ్చితత్వం, స్థిరత్వం, క్రీడా నైపుణ్యంపై ఆమెకున్న అంకితభావం అద్భుతమమని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“2026 ఆసియా పారా క్రీడల్లో మహిళల వ్యక్తిగత పారా కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో శీతల్ దేవి అద్భుతమైన ప్రదర్శన చేశారు. విజయవంతంగా టైటిల్ నిలబెట్టుకుని, వరుసగా రెండో ఎడిషన్‌లోనూ స్వర్ణ పతకం సాధించారు. కచ్చితత్వం, స్థిరత్వం, క్రీడా నైపుణ్యంపై అంకితభావం ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: పీఎం @narendramodi”

 

***


(రిలీజ్ ఐడి: 2327384) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Urdu , English , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam