నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 6:50PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడలు-2026 లో పురుషుల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో కాంస్య పతకం గెలుచుకొని ఈ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి చారిత్రాత్మక పతకాన్ని అందించిన నవీన్ శివకుమార్, సూర్య కాంత్ యాదవ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
తమ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇద్దరు క్రీడాకారులకు ఒక ప్రత్యేకమైన విషయమని పేర్కొన్న ప్రధాని.. వారి బృందస్ఫూర్తి, పట్టుదల, అంకితభావాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చారిత్రాత్మక కాంస్యం!
పారా ఆసియా క్రీడలు-2026లో పురుషుల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో నవీన్ శివకుమార్, సూర్య కాంత్ యాదవ్ భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించారు. తమ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇద్దరు క్రీడాకారులకు ఒక ప్రత్యేక విషయం. వారి బృందస్ఫూర్తి, పట్టుదల, అంకితభావాలు ఎంతో ప్రశంసనీయం. వారికి నా హృదయపూర్వక అభినందనలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"