నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 6:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజిమన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేశారు.
భారత్–ఇజ్రాయెల్ సంబంధాల్లో కొనసాగుతున్న వేగాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై తమ ఆలోచలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించాల్సిన తక్షణ అవసరాన్ని స్పష్టం చేశారు.
ముందుకు సాగేందుకు చర్చలూ, దౌత్యమే మార్గమని భారత్ ఇచ్చిన పిలుపును ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
సంప్రదింపులను కొనసాగించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు.
***