నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 5:29PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడలు-2026లో మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో అద్భుత విజయం సాధించిన సువర్ణ రాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఆమె కష్టపడే తత్వం, పట్టుదల, క్రీడల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావానికి ఈ విజయం నిదర్శనమని ప్రధాని అన్నారు. ఈ అద్భుతమైన విజయాన్ని భారతదేశం వేడుకగా జరుపుకుంటోందని పేర్కొంటూ.. రాబోయే పోటీలలో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"పారా ఆసియా క్రీడలు-2026లో మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో అద్భుతమైన విజయం సాధించిన సువర్ణ రాజ్‌కు అభినందనలు. ఆమె కష్టపడే తత్వం, పట్టుదల, క్రీడల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావానికి ఆమె విజయం నిదర్శనం. ఈ అద్భుతమైన విజయాన్ని భారతదేశం వేడుకగా జరుపుకుంటోంది. రాబోయే పోటీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: PM @narendramodi"