నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 7:20PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల షాట్ పుట్ ఎఫ్40 విభాగంలో కాంస్య పతకం సాధించిన రవి రొంగాలీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఇది మరో గొప్ప విజయమని పేర్కొంటూ- అంతర్జాతీయ వేదికపై నిరంతర విజయాలు తన క్రీడా విభాగంపై అతని అంకితభావాన్ని, నిబద్ధతను ప్రతిఫలిస్తున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రవి రొంగాలీకి మరో గొప్ప విజయం! ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల షాట్ పుట్ ఎఫ్40 విభాగంలో కాంస్య పతకం సాధించిన అతనికి నా అభినందనలు. అంతర్జాతీయ వేదికపై ఈ నిరంతర విజయాలు అతని అంకితభావాన్ని, నిబద్ధతను ప్రతిఫలిస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***