ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాక్రీడల్లో స్వర్ణం సాధించిన సచిన్ ఖిలారీకి ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:44PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో స్వర్ణం సాధించిన సచిన్ ఖిలారీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ఈ సీజన్లోనే అత్యుత్తమ త్రో విసిరి తన పతకాన్ని సచిన్ నిలబెట్టుకున్నారు.
పతకాన్ని నిలబెట్టుకోవడం, పోడియంపై పూర్తిగా భారతీయ క్రీడాకారులే ఉండేలా నడిపించడం అసాధారణమైన విషయమని శ్రీ మోదీ అన్నారు. సచిన్ ఖిలారీ కనబరిచిన నిలకడ, పట్టుదల, క్రీడా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. తన క్రీడా ప్రయాణంలో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఛాంపియన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘గొప్ప ఛాంపియన్!
ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో సచిన్ ఖిలారీ మరోసారి విజేతగా నిలిచారు. ఈ సీజన్లోనే అత్యుత్తమ త్రో విసిరి తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నారు. పతకాన్ని విజయవంతంగా కాపాడుకోవడం, పోడియంపై పూర్తిగా భారతీయ క్రీడాకారులకే స్థానం దక్కేలా నాయకత్వం వహించడం అసాధారణం. ఆయన నిలకడ, పట్టుదల, క్రీడా నైపుణ్యం స్ఫూర్తిదాయకం. తన క్రీడా ప్రయాణంలో మరో గొప్ప విజయం సాధించిన సచిన్‌కు హృదయపూర్వక అభినందనలు: పీఎం నరేంద్ర మోదీ’’
***
(రిలీజ్ ఐడి: 2326577)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam