ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఉమ్మిడి ఎతిరాజ్ మరణం పట్ల ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 3:01PM by PIB Hyderabad
శ్రీ ఉమ్మిడి ఎతిరాజ్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ జవహర్‌లాల్ నెహ్రూకు బహుకరించిన చారిత్రక సెంగోల్‌ను రూపొందించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు.
2023లో నూతన పార్లమెంటు భవనంలో సెంగోల్‌కు గౌరవప్రదమైన స్థానాన్ని ప్రభుత్వం కల్పించినప్పుడు ఆయనతో సమావేశమైన సందర్భాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. భారతదేశ సంప్రదాయాలకూ, దేశ ప్రయాణానికీ మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుసంధానాన్ని ఆయన జీవితం, కళానైపుణ్యం సూచిస్తాయని తెలిపారు. ఆయన కుటుంబానికీ, అభిమానులకూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘శ్రీ ఉమ్మడి ఎతిరాజ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ కుటుంబంలో జన్మించిన ఆయన, మాజీ ప్రధాని నెహ్రూకు బహూకరించిన చారిత్రక సెంగోల్‌ను తీర్చిదిద్దడంలో చేసిన కృషికి చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. ఎన్నో ఏళ్ల తర్వాత, 2023లో పార్లమెంట్ నూతన భవనంలో ఆ సెంగోల్‌కు సముచిత స్థానం కల్పించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కింది. ఆ సమయంలో శ్రీ వుమ్మిడి ఎతిరాజ్‌తో సమావేశమై... మన దేశానికి, సంస్కృతికి ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం నాకు లభించింది. సుసంపన్నమైన భారతీయ సంప్రదాయాలకు, మన దేశ ప్రయాణానికి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుసంధానాన్ని ఆయన జీవితం, కళా నైపుణ్యం ప్రతిబింబిస్తాయి. ఆయన కుటుంబ సభ్యులకూ, అభిమానులకూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
శ్రీ ఉమ్మిడి ఎతిరాజ్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. తమిళనాడుకు చెందిన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆయన, మాజీ ప్రధాని నెహ్రూకు అందించిన చారిత్రక సెంగోల్‌ను రూపొందించడంలో చేసిన కృషికి చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. ఎన్నో ఏళ్ల తర్వాత, 2023లో పార్లమెంట్ కొత్త భవనంలో ఆ సెంగోల్‌కు సముచిత గౌరవం కల్పించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కింది. ఆ సమయంలో శ్రీ ఉమ్మిడి ఎతిరాజ్‌తో సమావేశమై, మన దేశానికి, సంస్కృతికి ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపే అదృష్టం నాకు లభించింది. సుసంపన్నమైన భారతదేశ వారసత్వానికి, మన దేశ ప్రగతి ప్రయాణానికి మధ్య ఉన్న గొప్ప అనుసంధానాన్ని ఆయన జీవితం, కళానైపుణ్యం ప్రతిబింబిస్తాయి. ఆయన కుటుంబ సభ్యులకూ, అభిమానులకూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
****
(రిలీజ్ ఐడి: 2326013)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9