నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 6:31PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు-2026లో మహిళల సింగిల్స్ క్లాస్ 4-5 విభాగంలో కాంస్యం సాధించిన భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరో పతకాన్ని, మరో విజయాన్ని భవీనా పటేల్ సాధించారని శ్రీ మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ఆమె కనబరుస్తున్న నిలకడ, క్రీడా నైపుణ్యం పట్ల అచంచలమైన అంకితభావం ఆదర్శనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘మరో పతకం, మరో విజయం!
ఆసియా పారా క్రీడలు-2026లో మహిళల సింగిల్స్ క్లాస్ 4-5 విభాగంలో కాంస్యం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. గత కొన్నేళ్లుగా ఆమె కనబరుస్తున్న నిలకడైన ఆటతీరు, క్రీడా నైపుణ్యం పట్ల ఆమె అంచంచలమైన అంకితభావం ఆదర్శనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
***