నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:20PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల షాట్‌పుట్ ఎఫ్11 ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్న ప్రవీణ్ శర్మకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
అతని సాహసం, సన్నద్ధత, అంకిత భావానికి ఈ విజయం ఒక నిదర్శనమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పురుషుల షాట్‌పుట్ ఎఫ్11 ఈవెంట్‌లో కాంస్య పతక విజేత ప్రవీణ్ శర్మకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం అతని సాహసానికి, సన్నద్ధతకు, అంకితభావానికి ప్రతీక. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.