ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం సాధించిన ప్రణవ్ సూర్మకు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 9:25PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్51/52/53 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, స్వర్ణంతో పాటు సరికొత్త రికార్డు సాధించిన ప్రణవ్ సూర్మను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

సరికొత్త ఆసియా రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక పతకం, విజయం మరింత గొప్పదనాన్ని సంతరించుకున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రణవ్ ప్రదర్శించిన సామర్థ్యం, పట్టుదల, పోటీతత్వం ప్రణవ్ స్ఫూర్తిదాయకమన్నారు. చరిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

 

‘‘ప్రతిష్ఠాత్మక పతకం, ఆసియా క్రీడల రికార్డు!

 

ఆసియా క్రీడలు – 2026లో ప్రణవ్ సూర్మ అద్భుత ప్రదర్శన కనబరిచారు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్51/52/53 విభాగంలో త్రో విసిరి రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణం సాధించారు. సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పడంతో ఈ విజయం మరింత గొప్పదనాన్ని సంతరించుకుంది. ప్రణవ్ కనబరిచిన సామర్థ్యం, పట్టుదల, పోటీతత్వం స్ఫూర్తిదాయకం. చరిత్రాత్మక విజయం సాధించిన ఆయనకు అభినందనలు: పీఎం నరేంద్రమోదీ’’

 

***


(రిలీజ్ ఐడి: 2325804) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam