హోం మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరంతరం అడ్డుకుంటూ డ్రగ్స్ ముఠాల ఆట కట్టించిన అసోం ముఖ్యమంత్రిని ,
అసోం పోలీసులను అభినందించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
అసోంలో మాదకద్రవ్యాలపై చేపట్టిన నిరంతర దాడుల్లో 945 మంది అరెస్టు - 547 కేసుల నమోదు - రూ.182 కోట్ల పైగా విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
703 మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రాలపై చర్యలు - కొనసాగుతున్న దాదాపు రూ.31 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ప్రక్రియ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘నషా ముక్త్ భారత్’ ఆశయ సాధనలో భాగంగా డ్రగ్స్ ముఠాలను పూర్తిగా నిర్మూలించే ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్న 2026 - 29 మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్
డ్రగ్స్ ముఠాల ఆర్థిక మూలాలను దెబ్బతీసి, యువతను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడే లక్ష్యంతో
రూపుదిద్దుకున్న 2026 - 29 మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్
మాదకద్రవ్యాలపై తిరుగులేని దృఢ సంకల్పంతో నిరంతర పోరాటం
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 6:34PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరంతరం అడ్డుకుంటూ డ్రగ్స్ ముఠాలను గట్టి దెబ్బ కొట్టిన అసోం పోలీసులను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేడు అభినందించారు.
“డ్రగ్స్ ముఠాలకు గట్టి దెబ్బ! మాదకద్రవ్యాలపై నిరంతరం ఉక్కుపాదం మోపుతున్న అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మను, అసోం పోలీసులను అభినందిస్తున్నాను. ఈ చర్యల్లో భాగంగా 945 మంది అరెస్టయ్యారు. 547 కేసులు నమోదయ్యాయి. రూ.182 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 703 సమస్యాత్మక ప్రాంతాలపై చర్యలు చేపట్టారు. దాదాపు రూ.31 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన నషా ముక్త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా, డ్రగ్స్ ముఠాలను కూలదోసి, వాటి ఆర్థిక మూలాలను దెబ్బతీసి, యువతను కాపాడాలన్న మా సంకల్పాన్ని 2026 - 29 మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ పునరుద్ఘాటిస్తోంది. మాదకద్రవ్యాలపై పోరాటం ఏమాత్రం వెనుకడుగు వేయని దృఢ సంకల్పంతో కొనసాగుతుంది” అని శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా, విస్తృత ముందస్తు ప్రణాళికతో అసోం పోలీసులు 2026 అక్టోబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో డ్రగ్స్కు సంబంధించిన 547 కేసులు నమోదు చేసి, 945 మంది నిందితులను అరెస్టు చేశారు.
పురోగతి వివరాలు:
-
సుమారు రూ . కోట్ల విలువగల మత్తు పదార్థాలు (నార్కోటిక్స్), మనో ప్రభావిత సైకోట్రోపిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
-
బెయిల్ పొందేందుకు వీలులేని 73 అరెస్టు వారెంట్లను అమలు చేశారు. పరారీలో ఉన్న 47 మందిని పట్టుకున్నారు. వీరిలో ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన 10 మంది ఉన్నారు.
-
మాదకద్రవ్యాల విక్రయాలు, వాడకం అధికంగా ఉన్న 703కి పైగా కీలక ప్రాంతాలపై అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు.
-
సుమారు రూ.31 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం, అటాచ్ చేయడం లేదా నిలిపివేయడానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
-
మాదకద్రవ్యాలు, మనోప్రభావిత పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం (పీఐటీఎన్డీపీఎస్) కింద 157 ప్రతిపాదనలపై తదుపరి చర్యల ప్రక్రియ కొనసాగుతోంది.
-
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (సీఓటీపీఏ) ) కింద 2,229 దాడులు నిర్వహించారు. 3,662 వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. 2,943 విద్యాసంస్థల్లో సర్వేలు నిర్వహించారు.
-
ఐఎంఎఫ్ఎల్ సహా 1,34,539 లీటర్ల మద్యం స్వాధీనం లేదా ధ్వంసం చేశారు
-
633 కార్యక్రమాల ద్వారా 1,12,532 మంది పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2324182)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12