వివరాలు:
1. ఈ పథకం, అనుబంధ పథకాల పేరు మార్పు:
|
ప్రస్తుతం ఉన్న పేరు
|
ఆమోదించిన పేరు
|
|
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ)
|
ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన
|
|
ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (ఐజీఎన్వోఏపీఎస్)
|
ప్రధానమంత్రి వృద్ధావస్థ పెన్షన్ యోజన
|
|
ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛను పథకం (ఐజీఎన్డబ్ల్యూపీఎస్)
|
ప్రధానమంత్రి విధవా పెన్షన్ యోజన
|
|
ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగుల పింఛను పథకం (ఐజీఎన్డీపీఎస్)
|
ప్రధానమంత్రి దివ్యాంగజన్ పెన్షన్ యోజన
|
|
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
|
ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజన
|
2. దివ్యాంగుల పెన్షనులో మార్పులు:
దివ్యాంగజన్ పెన్షన్ పథకం కింద, 0-79 ఏళ్ల వయస్సు గల దివ్యాంగులకు అందించే సహాయ మొత్తం ఇకపై రూ.375గానూ... 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి రూ.625గానూ ఉంటుంది. ఈ పథకం కింద అందించే సహాయ మొత్తాన్ని పెంచడంతో పాటు కింది మార్పులూ చేశారు:
(a) ఈ పథకం కింద ప్రామాణిక వైకల్య శాతం ప్రస్తుతం 80శాతం ఉండగా దానిని 40 శాతానికి మార్చారు.
(b) పెన్షన్ పొందడం కోసం దివ్యాంగుల కనీస వయస్సు నిబంధనను ఇప్పుడు పుట్టుకతోనే వర్తించేలా మార్చారు.
iii. వృద్ధులు, వితంతువుల కోసం గల పెన్షన్ పథకాలు, కుటుంబ ప్రయోజన పథకం ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగుతాయి.
ప్రయోజనాలు:
ఈ ఆమోదం ద్వారా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 3.20 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు.
అమలు వ్యూహం, లక్ష్యం:
దివ్యాంగుల పెన్షన్ పథకం కింద అర్హత ప్రమాణాలు, లబ్ధిదారుల సంఖ్య, సహాయం మొత్తంలో మార్పులకు సంబంధించిన మార్గదర్శకాలను మూడు నెలల్లోపు జారీ చేసి, అమలు చేయనున్నారు.
నేపథ్యం:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41లోని రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల ప్రకారం 15 ఆగస్టు 1995న... పేద కుటుంబాలకు సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చడం లక్ష్యంగా జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ)ను ప్రారంభించారు. దేశంలోని ప్రతిచోటా లబ్ధిదారులకు సహాయం ఒకే విధంగా అందుబాటులో ఉండేలా చూడటం... 100 శాతం కేంద్ర సహాయం అందించడం వెనక గల ఉద్దేశం.
దివ్యాంగుల పెన్షన్కు సంబంధించిన అర్హతా ప్రమాణాల్లో మార్పులను దివ్యాంగుల హక్కుల చట్టం-2016 తప్పనిసరి చేసింది. దానిని 40 శాతం 'ప్రామాణిక వైకల్యం'తో అనుసంధానించింది. అదనంగా, ఇతర వర్గాల కోసం ప్రతిపాదించిన ఇదే తరహా పథకాలతో పోలిస్తే... దివ్యాంగులకు అందించే సహాయం తప్పనిసరిగా 25 శాతం ఎక్కువగా ఉండాలనీ ఇది నిర్దేశించింది.
***