రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

టాంజానియాలోని అరుషాలో 153వ అంతర్గత-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అసెంబ్లీ.... అయిదవ రోజు, చివరి రోజైన అక్టోబర్ 9, 2026న పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 1:10PM by PIB Hyderabad

ఐపీయూ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి శ్రీ హరివంశ్, ప్రతినిధి బృంద సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అంతర్గత-పార్లమెంటరీ యూనియన్‌ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రత్యేక సమావేశాల నివేదికల వంటి అజెండా అంశాలపై చర్చించారు.

అంతర్గత-పార్లమెంటరీ యూనియన్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు కేటాయించిన మూడు ఓట్లను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, లోక్‌సభ సభ్యులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, లోక్‌సభ సభ్యురాలు శ్రీమతి కమల్‌జిత్ సెహ్రావత్ వేశారు.

రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల అనంతరం అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఐపీయూ నూతన అధ్యక్షుడిగా ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ స్పీకర్ శ్రీ మిల్టన్ డిక్ ఎన్నికైనట్లు వెల్లడించారు. అనంతరం శ్రీ హరివంశ్, భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులు మిస్టర్ డిక్‌ను అభినందించి, ఐపీయూ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

లోక్‌సభ స్పీకర్ తరఫున పంపిన అభినందన లేఖను మిస్టర్ మిల్టన్ డిక్‌కు రాజ్యసభ ఎంపీ డాక్టర్ సస్మిత్ పాత్ర అందజేశారు.

గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత, అరుషా ప్రకటనను ఆమోదించటానికి "అందరికీ సమ్మిళిత సామాజిక అభివృద్ధి: వికలాంగుల హక్కులు, సాధికారతను పెంపొందించటానికి పార్లమెంటరీ వ్యూహాలు" అనే అంశంపై ప్రజాస్వామ్యం, మానవ హక్కుల స్థాయీ సంఘం సమర్పించిన తీర్మానాన్ని, "హిమాలయ ప్రాంతం, ఇతర వెనకబడిన ప్రాంతాల్లో వాతావరణ సంబంధిత విపత్తులను ఎదుర్కొనేందుకు, సుస్థిరతను బలోపేతం చేయటానికి తక్షణ పార్లమెంటరీ చర్య" అంశంపై తీర్మానాన్ని ఆమోదించటానికి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఆ తర్వాత టాంజానియా నేషనల్ అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ అధ్యక్షుడు గౌరవ ముస్సా అజ్జాన్ జుంగు అసెంబ్లీ ముగిసినట్లు ప్రకటించారు.

2026 అక్టోబర్ 5 నుంచి 9 వరకు టాంజానియాలోని అరుషాలో జరిగిన 153వ ఐపీయూ అసెంబ్లీలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గౌరవ శ్రీ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ ప్రతినిధి బృందం భాగస్వామ్యం విశేషంగా, ప్రభావవంతంగా సాగింది. ఐపీయూ అసెంబ్లీ తీర్మానాలు, ఫలితాలకు ఇది ఎంతగానో దోహదపడింది.

 

***


(రిలీజ్ ఐడి: 2321969) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Malayalam