రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కోల్‌కతాలోని జీఆర్ఎస్‍ఈలో జలప్రవేశం చేసిన తదుపరి తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌక (యార్డ్ 3040, శ్రేయస్)

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 7:20PM by PIB Hyderabad

కోల్‌కతాలోని జీఆర్ఎస్‌ఈలో 2026 అక్టోబర్ 10న నావల్ స్టాఫ్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ సమక్షంలో శ్రీమతి రేమాన్ కొచ్చర్.. తదుపరి తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌక (ఎన్‌జీఓపీవీ) అయిన యార్డ్ 3040‌ను (శ్రేయస్) జలప్రవేశం చేయించారు. ఈ వేడుక భారత నావికాదళానికి ఉన్న ఉన్నత సంప్రదాయాలను, విలువలను తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో భారత నావికాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ, జీఆర్ఎస్‌ఈ, పరిశ్రమ భాగస్వాముల నుంచి సీనియర్ ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఏకకాలంలో రెండు షిప్‌యార్డ్‌లు (గోవాలోని జీఎస్‌ఎల్, కోల్‌కతాలోని జీఆర్ఎస్‌ఈ) ఎన్‌జీఓపీవీలను నిర్మిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి నిర్మించిన ఈ నౌకలు.. సముద్ర నిఘా (మారిటైమ్ సర్వైలెన్స్), అన్వేషణ- రక్షణ (సెర్చ్- రెస్క్యూ), ఆఫ్‌షోర్ ఆస్తుల పరిరక్షణ, మానవతా దృక్పథంతో చేసే విపత్తు సహాయక చర్యలు (హెచ్ఏడీఆర్), సముద్రపు దొంగల నిరోధక చర్యలు వంటి వివిధ రకాల కార్యకలాపాలలో ప్రస్తుతం ఉన్న ఓపీవీలు లేదా ఎన్ఓపీల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అనుగుణంగా ఈ నౌకల పేర్లు పెట్టారు. సంస్కృతంలో 'శ్రేయస్' అనగా 'ఉత్తమమైనది' లేదా 'శ్రేష్ఠమైనది' అని అర్థం.

ఈ జలప్రవేశం భారత నావికాదళం స్వదేశీ నౌకా నిర్మాణంలో సాధించిన మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' నినాదాలకు అనుగుణంగా ఉంది.


(రిలీజ్ ఐడి: 2321952) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Punjabi