ప్రధాన మంత్రి కార్యాలయం
మహాలయ పర్వదిన సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2026 9:30AM by PIB Hyderabad
మహాలయ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో సంతోషం, కరుణ, ఆశాభావం వెల్లివిరియాలని ఆయన ప్రార్థించారు. అందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు.
“శుభో మహాలయ
దుర్గామాత ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులతో మన సమాజం సంతోషం, కరుణ, ఆశాభావంతో నిండిపోవాలి. అన్ని వైపులా శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలి’’.
(రిలీజ్ ఐడి: 2321718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam