కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత నియంత్రణ వ్యవస్థలో- వివక్షకీ, విచక్షణకీ తావులేని శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 9:19AM by PIB Hyderabad

శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. భారత నియంత్రణ వ్యవస్థలో నిబంధనలు వివక్షతో ఉన్నట్లు ఆ పోస్టుల ద్వారా తెలుస్తోంది. కానీ, శాటిలైట్ సేవలతో సహా అన్ని టెలికాం సేవల కోసం నాణ్యమైన, వివక్షకు తావులేని నిబంధనల విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో... నాన్- జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్ ప్రాతిపదికన- ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలందించే మూడు అంతర్జాతీయ శాటిలైట్ సంస్థలకు ప్రభుత్వం టెలికాం లైసెన్సులను మంజూరు చేసింది. లైసెన్స్ నిబంధనల ప్రకారం… లైసెన్సుదారులు భద్రతా షరతులను పాటించాల్సి ఉంటుంది. సేవలను ఉపయోగించుకునే వినియోగదారుల భద్రతతో పాటు, సమాచార రక్షణకు సంబంధించిన వివిధ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడటమే దీని ఉద్దేశం. ఈ ప్రక్రియలో భాగంగా ముగ్గురు లైసెన్సుదారుల విషయంలో భద్రతాపరమైన సమీక్ష కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లైసెన్సు పొందిన సంస్థ తదుపరి దశకు వెళ్లవచ్చు. ప్రస్తుతం మూడు సంస్థలూ దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయి. కాబట్టి ఈ నియంత్రణ వ్యవస్థ, దాని అమలు నిబంధనలకు విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఉన్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవి.

***


(రిలీజ్ ఐడి: 2320698) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Malayalam