వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూయార్క్‌లో యూఎస్ కంపెనీలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వరుస భేటీలు
భారత్-అమెరికా వాణిజ్య, పెట్టుబడుల బంధాలను బలోపేతం చేసే దిశగా చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 10:48AM by PIB Hyderabad
న్యూయార్క్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారులతో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ వారం వరుస సమావేశాలు నిర్వహించారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై చర్చించడంతోపాటు.. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని అమెరికా కంపెనీలను కేంద్ర మంత్రి ఆహ్వానించారు.
బ్లాక్‌స్టోన్ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) జోనాథన్ గ్రే, బ్లాక్‌స్టోన్ ఇంటర్నేషనల్ ప్రైవేటు ఈక్విటీ విభాగం చైర్మన్ ప్రకాశ్ మెల్వానీలతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లోని కీలక రంగాల్లో బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు, భాగస్వామ్యాలను మరింత విస్తరించే అంశంపై చర్చించారు.
న్యూబెర్గర్ బెర్మన్ చైర్మన్, సీఈఓ జార్జ్ వాకర్, ఆ సంస్థ నాయకత్వ బృందంలోని సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థిక, సంపద నిర్వహణ సేవల రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని పెంచే అవకాశాలపై చర్చించారు.
ది ఎస్టీ లాడర్ కంపెనీస్ అధ్యక్షుడు, సీఈఓ స్టెఫాన్ డీ లా ఫావెరీతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లో తయారీ, ఉత్పత్తుల సేకరణను పెంచడం ద్వారా వృద్ధి అవకాశాలతోపాటు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్‌పై చర్చించారు.
ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో జరిగిన సమావేశంలో భారత్‌లో ఐబీఎం కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, కృత్రిమ మేధ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, క్వాంటం కంప్యూటింగ్, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చించారు.a
మెట్‌లైఫ్ అధ్యక్షుడు, సీఈఓ మిచెల్ ఎ ఖలాఫ్‌తో జరిగిన సమావేశంలో భారత్‌లో కంపెనీ వృద్ధి అవకాశాలు, విస్తరిస్తున్న బీమా, ఆర్థిక సేవల రంగంపై చర్చించారు.
జనరల్ అట్లాంటిక్ చైర్మన్, సీఈఓ విలియం ఈ ఫోర్డ్‌తో శ్రీ గోయల్ సమావేశమయ్యారు. భారత్‌తో సంస్థ పెట్టుబడులు, వ్యాపార సంబంధాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు.
ఏఐఏ గ్రూప్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ టక్కర్‌తో కూడా శ్రీ గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లో ఏఐఏ కార్యకలాపాలు, బీమా, ఆర్థిక సేవల రంగాల్లో అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా 2047 నాటికి ‘అందరికీ బీమా’ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ రంగాల్లో అవకాశాలను పరిశీలించారు.
ఈ సమావేశాల ద్వారా ఆర్థిక సేవలు, తయారీ, ఇంధనం, సాంకేతికత, కృత్రిమ మేధ తదితర రంగాల్లో భారత్ వృద్ధి అవకాశాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చ జరిగింది. వీటితోపాటు భారత్-అమెరికా ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపైనా చర్చించారు.
***
(రిలీజ్ ఐడి: 2320220)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam