ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ వినాయక్ దేవాలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 11:21AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో శ్రీ వినాయక్ దేవాలయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వెళ్లి, భగవాన్ శ్రీ గణేశుడి పూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. విఘ్నహర్త కృప అందరిపై ప్రసరించి వారికి మేలు కలగాలనీ, భారతదేశం నిరంతరం ప్రగతి మార్గంలో ముందుకు పయనించాలనీ శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు న్యూఢిల్లీ.. శ్రీ వినాయక్ మందిరం అర్చనలో పాల్గొన్నాను.
దేశవ్యాప్తంగా ప్రజలకు సుఖ సంతోషాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిందిగా భగవాన్ శ్రీ గణేశుడిని వేడుకున్నాను.
విఘ్నహర్త కృపతో అందరికీ మేలు కలగాలనీ, దేశం నిరంతరం ప్రగతి పథంలో ముందు ముందుకు సాగిపోతూ ఉండాలనీ ప్రార్థించాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2320085)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam