రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్–1)ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టనున్న రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్: ఎఫ్ఎస్ఎస్–5 నిర్మాణానికి శ్రీకారం, మెరుగుపరిచిన స్లిప్‌వే–4, 300 టన్నుల గోలియత్ క్రేన్ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 4:10PM by PIB Hyderabad
భారత స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ 2026 అక్టోబర్ 6న విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద ఫ్లీట్ సపోర్ట్ షిప్–1 (ఎఫ్ఎస్ఎస్–1)ను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రారంభిస్తారు. అలాగే ఫ్లీట్ సపోర్ట్ షిప్–5 (ఎఫ్ఎస్ఎస్–5) నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మెరుగుపరిచిన స్లిప్‌వే–4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను కూడా ప్రారంభిస్తారు.
పెంచిన పొడవు, అధిక బరువును మోసే సామర్థ్యంతో ఆధునికీకరించిన స్లిప్‌వే–4కు 300 టన్నుల సామర్థ్యం ఉన్న గోలియత్ క్రేన్ అదనపు తోడ్పాటును అందిస్తుంది. ఫలితంగా 45,000 డీడబ్ల్యూటీ వరకు ఉన్న నౌకల నిర్మాణానికి, వాటిని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టేందుకు షిప్‌యార్డుకు వీలు కల్పిస్తుంది. తద్వారా భారీ, సంక్లిష్టమైన నౌకలను నిర్మించే షిప్‌యార్డ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న అయిదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల్లో ఎఫ్‌ఎస్‌ఎస్-1 మొదటిది. నిర్మాణం ప్రారంభమైన 18 నెలల్లోనే దీనిని బంగాళాఖాత జలాల్లోకి ప్రవేశపెడుతున్నారు. 43,500 టన్నుల బరువున్న ఈ నౌకలు సముద్రంలో యుద్ధ నౌకలకు అవసరమైన వాటిని అందిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ సామర్థ్యాన్ని, పరిధిని విస్తరిస్తాయి. ఎఫ్‌ఎస్‌ఎస్-5 నిర్మాణ ప్రారంభం... ఈ కార్యక్రమం ఉత్పత్తి దిశగా స్థిరంగా ముందుకు సాగుతుందని సూచిస్తుంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, నౌకాదళ సిబ్బంది ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, ఇతరులు హాజరవుతారు.
***
(రిలీజ్ ఐడి: 2319311)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15