అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

యూసీఐఎల్ వజ్రోత్సవాలు : భారతదేశ యురేనియం మైనింగ్, శుద్ధి సామర్థ్యాల్లో ఆరు దశాబ్దాల ప్రయాణం

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2026 8:31AM by PIB Hyderabad
  • 1967 అక్టోబర్ 4న ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతున్న ఆరు దశాబ్దాల ప్రయాణానికీ, భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమానికీ అందించిన తోడ్పాటుకు చిహ్నంగా అణు శక్తి విభాగం పరిధిలోని పీఎస్‌యూ అయిన యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వజ్రోత్సవాలను నిర్వహించింది. 

  • జాదుగూడలో జరిగిన ఈ వేడుకలకు అటామిక్ ఎనర్జీ కమిషన్, ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీ డెమనస్ట్రేషన్ పైలట్ ప్లాంట్‌ను, డీఏఈ అనుబంధ సంస్థ అయిన సాహా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌కు చెందిన డార్క్ మ్యాటర్ ల్యాబొరేటరీ ప్రతిపాదిత స్థలాన్ని ఆమె సందర్శించారు.

  • యూసీఐఎల్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మీడియా ప్రతినిధుల కోసం ఒక వర్కుషాప్ నిర్వహించారు.

  • అణుశక్తి అందించే పారిశ్రామిక, సామాజిక అనువర్తనాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డీఏఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

  • యురేనియం మైనింగ్, శుద్ధిలో విస్తరిస్తున్న యూసీఐఎల్ సామర్థ్యాలను ఈ వేడుకలు ప్రదర్శించాయి. అలాగే భారతీయ అణు శక్తి కార్యక్రమానికి చరిత్రాత్మకంగా ఈ సంస్థ అందిస్తున్న సహకారాన్ని ప్రతిబింబించాయి. 

అణు శక్తి విభాగం (డీఏఈ) పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్). యురేనియం తవ్వకాలు, శుద్ధిలో ఆరు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయాణాన్ని, భారతీయ అణు విద్యుత్ కార్యక్రమానికి అందిస్తున్న సహకారాన్ని సూచిస్తూ.. ఈ సంస్థ 2026 అక్టోబర్ 4న వజ్రోత్సవాలను నిర్వహించింది. 

యూసీఐఎల్ సంస్థాగత ప్రయాణంలో ముఖ్యమైన ఈ మైలురాయిని ఘనంగా నిర్వహించుకొనేలా, భవిష్యత్తు అవకాశాలూ, ఉమ్మడి బాధ్యతల వైపు దృష్టి సారించేలా జాదుగూడలో జరిగిన వజ్రోత్సవాల్లో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది, ఉద్యోగులు, పాత్రికేయులు, ఈ రంగంలోని ఇతర నిపుణులు పాల్గొన్నారు. 

అటామిక్ ఎనర్జీ కమిషన్, ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ వజ్రోత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాదుగూడలోని ఆర్ అండ్ డీ, సీ వద్ద ఉన్న టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ ప్లాంట్ (టీడీపీపీ)ను సందర్శించారు. అలాగే జాదుగూడ భూగర్భ గనిలోని 815 మీ.ల వద్ద డార్క్ మ్యాటర్ ల్యాబరేటరీ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో అటామిక్ ఎనర్జీ కమిషన్, ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ ప్రసంగించారు. ‘‘ఆరు దశాబ్దాల శాస్త్రీయ సామర్థ్యాన్ని, సంస్థగాత అనుభవాన్ని, దేశానికి అంకితభావంతో అందించిన సేవలకు నిర్వహిస్తున్న వేడుకలే ఈ వజ్రోత్సవాలు. ఇది భారతదేశ యురేనియం మైనింగ్, శుద్ధి సామర్థ్యాలకు పునాదులు వేసిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఇతర మార్గదర్శకులకు గౌరవప్రదమైన నివాళిని అర్పించే సందర్భం కూడా. భూగర్భం నుంచి అతిపెద్ద అణు విద్యుత్ కార్యక్రమం వరకు యురేనియం మైనింగ్‌, శుద్ధిలో దేశీయ సామర్థ్యాలను నిర్మించడంలో ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పాత్రను యూసీఐల్ పోషించింది. గడచిన ఆరు దశాబ్దాలుగా ప్రధానమైన ఈ జాతీయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులు, వాతావరణంలో వివిధ తరాలకు చెందిన యూసీఐఎల్ సిబ్బంది అంకితభావంతో, ధైర్యంతో పనిచేస్తున్నారు. అణు శక్తిలో తన పాత్రను విస్తరించే దిశగా భారత్ ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులు, సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలను గుర్తించేందుకూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకూ ఈ ప్రత్యేక సందర్భం ఓ అవకాశంగా పనిచేస్తుంది’’ అన్నారు.

అణుశక్తి శాఖ కార్యదర్శి, అణుశక్తి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. “అణుశక్తి లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తున్న తరుణంలో యూసీఐఎల్ చేసిన సేవలను గుర్తించడానికీ, నిరంతర ఆవిష్కరణలు, సామర్థ్య నిర్మాణ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించడానికీ ఈ వజ్రోత్సవ సంవత్సరం ఒక సందర్భం” అని చెప్పారు.

నర్వాపహార్‌లోని ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల వర్కుషాపు ఈ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమాల్లో ముఖ్యమైనది. దీనితో పాటు డీఏఈ యూనిట్లు, సంస్థలు రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, అప్లికేషన్లను ప్రదర్శించే డీఏఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహించారు.

భారత దేశ అణు విద్యుత్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సైన్స్, టెక్నాలజీ, వ్యక్తులను ఈ వర్కుషాపు మీడియా ప్రతినిధులకు మరింత చేరువ చేసింది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో సంభాషించే అవకాశాన్ని ఈ కార్యక్రమం పాత్రికేయులకు అందించింది. అలాగే విస్తృతమైన న్యూక్లియర్, రేడియేషన్ టెక్నాలజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలు, అప్లికేషన్ల గురించి అర్థం చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది.

యూసీఐఎల్ యురేనియం మైనింగ్, మిల్లింగ్ కేంద్రాలను పత్రికా ప్రతినిధులు సందర్శించారు. మైనింగ్ కార్యకలాపాలు, ఓర్ నిర్వహణ, శుద్ధి వ్యవస్థలు, కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాలు, పద్ధతుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా యూసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాచం ఆనందరావు ప్రసంగించారు. ‘‘యూసీఐఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికీ ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరం గర్వించదగిన సందర్భం. గత ఆరు దశాబ్దాలుగా యూసీఐఎల్ యురేనియం తవ్వకం, శుద్ధిలో నైపుణ్యం, మౌలిక సదుపాయాలను స్థిరంగా నిర్మించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం, భద్రత, పర్యావరణ నిర్వహణలో తన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. ఈ సందర్భంగా  మా కార్యకలాపాలను, సదుపాయాలను సందర్శించే అవకాశం మీడియా ప్రతినిధులకు కల్పించడం మాకు ప్రత్యేకమైనది. మా కార్యకలాపాల్లో భాగం పంచుకుంటున్న సైన్స్, టెక్నాలజీ, వ్యక్తులతో పాటుగా డీఏఈ అమలు చేస్తున్న విస్తృత కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని జర్నలిస్టుల వర్కుషాపు, డీఏఈ టెక్నాలజీ ఎక్స్‌పో అందించాయి’’ అని తెలిపారు.

యురేనియం మైనింగ్, శుద్ధి సామర్థ్యాల్లో దేశీయ సామర్థ్యాల అభివృద్ధిలో అంతర్భాగంగా 1967లో స్థాపించిన యూసీఐఎల్ ఉంది. అలాగే భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమానికి అవసరమైన వనరులను అందిస్తోంది. భూగర్భ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ నుంచి ఖనిజ శుద్ధి, సాంకేతిక అభివృద్ధి, వృత్తిపరమైన భద్రత, రేడియషన్ నుంచి రక్షణ, పర్యావరణ నిర్వహణ వరకు ప్రత్యేకమైన జాతీయ సామర్థ్యంలో వచ్చిన పరిణామ క్రమాన్ని ఈ వ్రజోత్సవ వేడుకలు సూచిస్తున్నాయి.

ఆరు దశాబ్దాల అనుభవం. సామర్థ్యం పట్ల దృడమైన అంకితభావం. భారతదేశ అణుశక్తి కార్యక్రమ భవిష్యత్తు దిశగా నూతన ప్రయాణం. దారి చూపేది యురేనియమే!!

 ***


(రిలీజ్ ఐడి: 2319104) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Tamil